2019లో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. తొలిచిత్రంతో హిట్ సాధించడమే కాకుండా మంచి జోడి అనిపించుకున్నారు ఈ యంగ్ జంట. ఈ చిత్ర షూటింగ్ లో ఇరువురి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అది అలా అలా పెరుగుతూ వృక్షంగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది ఆగస్టు 22న పెళ్లి పీటలు ఎక్కారు. బ్యాచ్ లర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేస్తూ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు యంగ్ కపుల్.
Also Read : Kantara : కాంతారా 3 లో జూనియర్ ఎన్టీఆర్?
కాగా ఈ యంగ్ కపుల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. కాగా నేడు ఆ బిడ్డకు నామకరణం చేసేందుకు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసారు కిరణ్, రహస్య దంపతులు. చంటి బిడ్డతో పాటు కిరణ్ కుటుంబ సభ్యులు తిరుమలలో వేదపండితులు సమక్షంలో నామధేయ కార్యక్రమం నిర్వహించారు. పుట్టిన తేదీ, నక్షత్రం ప్రకారం కిరణ్, రహస్య దంపతులు వారి కుమారునికి ‘ హను అబ్బవరం’ గా నామకరణం చేసారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కిరణ్ అబ్బవరం. విఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోగా అనంతరం కిరణ్ అబ్బవరం దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేసారు.