DK: ‘నన్ను వదిలేసి ఫస్ట్ టైం చేస్తున్నావ్’.. సమంత ఈవెంట్‌లో రాజ్‌కు డీ.కే. కౌంటర్!

Raj And Dk

Raj And Dk

DK: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, నిర్మిస్తున్న వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. తాజాగా జరిగిన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు బాలీవుడ్ ప్రఖ్యాత క్రియేటర్ రాజ్‌తో పాటు డికే (రాజ్ & డీకే ద్వయం) హాజరయ్యారు. వేదికపై డీకే మాట్లాడుతూ.. సమంత, రాజ్‌లపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమంతతో నేను ఆల్రెడీ రెండు సిరీస్‌లలో కలిసి పని చేశాను. తనను డైరెక్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్‌తో ఒకటి మాత్రం చాలా నమ్మకంగా చెప్పగలను. సమంత ఏదైనా పని మొదలుపెడితే దానికి తన 100% ఇస్తుంది. తన హృదయాన్ని, సోల్‌ను, రక్తాన్ని.. సర్వస్వాన్ని ఆ ప్రాజెక్ట్ కోసం ధారపోస్తుంది. ఈ ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ చూస్తుంటే కూడా అదే అనిపించింది. తను ఏమాత్రం తగ్గకుండా కష్టపడింది. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది, మీ అందరితో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూడటానికి నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.

సమంత భర్త, ‘మా ఇంటి బంగారం’ సహ నిర్మాత అయిన రాజ్ నిడిమోరును ఉద్దేశించి ఆయన ఫన్నీ కామెంట్స్ చేశారు. “రాజ్.. నన్ను వదిలేసి నువ్వు ఫస్ట్ టైం ఇది ఒక్కడే ఒంటరిగా చేస్తున్నావ్. ఐ హోప్ నువ్వు మంచి పని చేసే ఉంటావని ఆశిస్తున్నా. ఆల్ ద బెస్ట్ రాజ్” అంటూ నవ్వించేశారు. మా ఇంటి బంగారం టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కాబోతుంది.

×
×
Ad