NTV Telugu Site icon

Diwali Clash : కిరణ్ అబ్బవరం డేరింగ్ స్టెప్.. కలిసొచ్చేనా..?

Ka (2)

Ka (2)

కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.  పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.  విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ ఈ సినిమా తనకు సక్సెస్ ఇస్తుందనిఎంతో నమ్మకంగా ఉన్నాడు.

Also Read : Diwali release : దీపావళి రేసులో అరడజను సినిమాలు.. సౌండ్ చేసేదెవరు..?

కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అతంత భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమాను దసరా కానుకగా విడుదల విడుదలకు ప్లాన్ చేసి మరల విరమించుకున్నారు. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 31న దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ను నందిపాటి వంశీ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ చిత్రం ఏంటంటే మలయాళం లో ఈ ససినిమాను దుల్కర్ విడుదల చేస్తుండగా తెలుగులో దుల్కర్ సినిమా లక్కీ భాస్కర్ తో పోటీగా రిలీజ్ కానుండడం. పాన్ ఇండియా బాషలలో నిర్మించిన ఈ సినిమా 5 సినిమాల మధ్య పోటీగా రిలీజ్ కాబోతోంది. ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసాడు ఈ హీరో. అందులో భాగంగా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే మాస్ జాతర సాంగ్ ను ఓ ప్రముఖ యూనివర్సిటీలో స్టూడెంట్స్ మధ్య రిలీజ్ చేసి డాన్స్ చేస్తూ అలరించాడు కిరణ్ అబ్బవరం