సినిమా స్టార్ కాగానే హీరో కనిపించే విధానానికి చెక్ పెట్టేస్తున్నారు మేకర్స్. గతంలో ఓ స్పెషల్ సాంగ్ లేదా ఓ చిన్న ఎలివేషన్లతో హీరో ఎంట్రీ ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మినిమం అరగంట గ్యాప్ ఉండాల్సిందే. ఈ మధ్య సలార్, కల్కిలో అరగంట తర్వాతే యంగ్ రెబల్ స్టార్ దర్శన భాగ్యం లభించింది.. జస్ట్ కటౌట్ కనిపిస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్. ఈ గ్యాప్ పెద్దగా లెక్క చేయడం లేదు. ఇప్పుడు కూలీ, వార్ 2లో రజనీకాంత్, జూనియర్ ఎంట్రీ కూడా ఇలాగే ప్లాన్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
Also Read : TFI : ప్లాప్ డైరెక్టర్స్ కు పిలిచి మరి ఛాన్స్ ఇస్తున్న ఫ్లాప్ హీరో
కూలీలో రజనీకాంత్ స్క్రీన్ పై కనిపించేంది మూవీ స్టార్టైన గంట తర్వాత అన్నది బజ్ నడుస్తోంది. ఈ గంటలోనే మిగిలిన క్యారెక్టర్లన్నింటినీ చూపించబోతున్నాడట లోకేశ్ కనగరాజ్. అటు బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమౌతున్న తారక్ కూడా టైటిల్ కార్డ్స్ పడిన అరగంట తర్వాతే కనిపించబోతున్నాడట. వార్ 2లో హృతిక్- తారక్ ఫేస్ ఆఫ్ అండ్ సాంగ్ స్క్రీన్స్ తగలబడిపోతాయంటున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇలా హీరోలను సినిమా స్టార్టైన అరగంటకు, గంటకు చూపించి ప్రేక్షకుడికి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఏదేమైనా తమ ఫేవరేట్ హీరోల కోసం ఎంత సేపేనా వెయిట్ చేసేందుకు రెడీగానే ఉన్నారు డై హార్ట్ ఫ్యాన్స్. రెండు హై ఆక్టేన్ మూవీస్ కూలీ, వార్ 2 బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ వార్‌కు రెడీ అవుతున్నాయి. రెండూ తెలుగు సినిమాలు కాదు కానీ అలా అని పొరుగు సినిమాలనీ తీసేయలేం. ఎందుకంటే ఇద్దరు టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోలు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రాల్లో భాగం కాబోతున్నారు. సో మన సినిమాలుగా రిసీవ్ చేసుకుంటున్నారు టాలీవుడ్ ఆడియన్స్. మరి ఆగస్టు 14న ఏ సినిమా హిట్ టాక్ తెచుకుంటుందో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సౌండ్ చేస్తుందో లెట్స్ వెయిట్.