Meher Ramesh: మొన్ననే కూతురి పెళ్లి.. ఇప్పుడు తీవ్ర విషాదంలో డైరెక్టర్ మెహర్ రమేష్ ఫ్యామిలీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొద్దిరోజుల క్రితమే తన కుమార్తె వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించి ఆ ఆనందంలో ఉన్న ఆయన కుటుంబాన్ని ఒక తీవ్ర శోకం ముంచెత్తింది. మెహర్ రమేష్ చిన్నక్క సుంకర మెహర్ జ్యోతి అకాల మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత 14 రోజులుగా తీవ్రమైన వైరల్ న్యుమోనియా (ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్) సమస్యతో బాధపడుతున్న జ్యోతికి ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో జూలై 21 రాత్రి 9:45 గంటలకు విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. సొంత అక్కను కోల్పోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు.
“నా ప్రియమైన చిన్నక్క మెహెర్ జ్యోతి సుంకర.. నా చిన్నప్పటి నుంచి నాకు అండగా నిలిచిన తను ఈరోజు మనల్ని విడిచి వెళ్లిపోయింది. నా కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించి, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎంతో ఆనందంగా గడిపిన మా అక్క, ఇంత తొందరగా ఆ దేవుడి దగ్గరకు వెళ్లిపోవడం మా కుటుంబానికి తీరని లోటు.” అంటూ మెహర్ రమేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఈ జూలై 1న మెహర్ రమేష్ కుమార్తె వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటు టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఆ వేడుకల్లో మెహర్ జ్యోతి ఎంతో ఉత్సాహంగా పాల్గొని కుటుంబ సభ్యులందరితో ఆనందంగా గడిపారు. ఆ శుభకార్య జ్ఞాపకాలు ఇంకా మనసుల్లో మెదులుతుండగానే, ఇంతలోనే ఆమె అనారోగ్యం బారినపడి కన్నుమూయడం కుటుంబ సభ్యులను, బంధువులను కోలుకోలేని దెబ్బతీసింది.
Also Read
విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మెహర్ జ్యోతి పార్థివదేహానికి నివాళులర్పించారు. మెహర్ రమేష్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మెగా కాంపౌండ్‌తో ఎంతో అనుబంధం ఉన్న మెహర్ రమేష్ కుటుంబానికి వచ్చిన ఈ కష్ట సమయంలో టాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు సోషల్ మీడియా ద్వారా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఈ బాధ నుంచి కోలుకునే ధైర్యాన్ని మెహర్ రమేష్ కుటుంబానికి ప్రసాదించాలని సినీ ప్రముఖులు ఆకాంక్షించారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!