Site icon NTV Telugu

Krish: హరిహర వీరమల్లు విషయంలో బాధగా ఉంది

Harihara Veeramallu

Harihara Veeramallu

దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా ప్రారంభమైంది, అయితే అనుకోకుండా ఆ సినిమా నుంచి ఆయన తప్పుకున్నారు. తర్వాత ఆయన స్థానంలో నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఎంటర్ అయ్యి సినిమాను పూర్తి చేశారు. అయితే తాజాగా, ఘాటి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, “మీరు మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆలస్యం కావడానికి కారణమేంటి? మీరు దర్శకుడుగా తప్పుకోవడానికి కారణమేంటి?” అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఆయన స్పందించారు.

Also Read : Pawan Kalyan : తండ్రి సమానులు.. మార్గదర్శి.. చిరుపై పవన్ అభిమానం

“అనుకోని పరిస్థితుల వల్లే నేను చేసిన సినిమా ఆలస్యమైంది. మాకు అన్ని కథలు కంచికి చేర్చాలి అనే కోరిక ఉంటుంది, కానీ కొన్ని కథలు ముగించలేం. హరిహర వీరమల్లుకు అలాగే జరిగింది. ఆ విషయంలో నాకు బాధగా ఉంది. మాకు ఏ.ఎం. రత్నం గారంటే అపారమైన గౌరవం. ఆయన ఒక విజనరీ ఫిలిం మేకర్. ఇప్పుడు మనం పాన్ ఇండియా అని చెప్పుకుంటున్నాం, దానికి ఒక మెట్టు వేసింది రత్నం గారు. పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం, చాలా గౌరవం. ఒక మనిషిగా చాలా గౌరవం, ఒక నాయకుడిగా అత్యంత గౌరవం, ఒక నటుడిగా గౌరవం ఉంది. కానీ షెడ్యూలింగ్స్ కారణంగా ఆ సినిమా ఎప్పుడు ముందుకు వెళుతుందో తెలియలేదు. ఒకానొక సందర్భానికి వచ్చాక, ఐదేళ్ల ప్రయాణంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. మా టీం మొత్తాన్ని మెయింటైన్ చేయాలి, కానీ అలా చేయలేక నెక్స్ట్ సినిమాకి ఫార్వర్డ్ అవ్వాల్సి వచ్చింది. నాకు కుదరలేదు, అందుకే వేరే ప్రాజెక్టుకి వచ్చాను,” అని క్రిష్ చెప్పుకొచ్చారు.

Exit mobile version