Tollywood : ఈ శుక్రవారం డైరెక్ట్ రిలీజ్ vs రీ రిలీజ్ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ తర్వాత కళ తప్పిన బాక్సాపీసుకు హరి హర వీరమల్లుతో ఓ ఊపు తెప్పించబోతున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది వీరమల్లు. ఈ వారం గ్యాప్ లో అటు కన్నడ, ఇటు తెలుగు, అటు తమిళ డబ్బింగ్ చిత్రాలు వరుసగా సందడి చేయబోతున్నాయి. కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో నిర్మాతగా ఫ్రూవ్ చేసుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. సినిమాపేరు ‘కొత్త పల్లిలో ఒకప్పుడు’. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్ ఉంది. రానా దగ్గుబాటి సమర్పణలో ఈమూవీ జులై 18న థియేటర్లలోకి రాబోతోంది.
Also Read : HHVM : హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ మారింది.. ఇదే ఫిక్స్
Also Read
- Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. 'స్పిరిట్' సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
- Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై నాన్ - బైలబుల్ వారెంట్.. రంగంలోకి దిగిన పోలీసులు! అసలేం జరిగిందంటే..
- Bollywood : సినీ ఫక్కీలో లేడిప్రొడ్యూసర్ 'డైమండ్ ఇయర్ రింగ్స్' కొట్టేశారు
- ToxicTheMovie : వాయిదాల పర్వం ముగిసింది.. టాక్సిక్ రిలీజ్ డేట్ వచ్చింది
ఈ ఫ్రైడే తమదే అంటున్నారు ఇద్దరు కన్నడ హీరోలు కిరీటీ అండ్ యువ రాజ్ కుమార్. పారిశ్రామిక వేత్త గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. జూనియర్ అంటూ చందన సీమతో పాటు టాలీవుడ్‌లోనూ తన లక్ టెస్ట్ చేసుకోబోతున్నాడు. ఇక శివరాజ్ కుమార్ సోదరుడి కొడుకు యువరాజ్ కుమార్ కూడా ఎక్కా అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ఈ సినిమాను శ్రీ సినీ వెంకటేశ్వర క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. ఈ సినిమాలకే స్పేస్ లేదనుకుంటే రీ రిలీజ్ చిత్రాలు కూడా సందడి చేయబోతున్నాయి. సూర్య బర్త్ డేని పురస్కరించుకుని జులై 18న రెండు సినిమాలు విడుదల చేస్తున్నారు. గజినీతో పాటు సూర్య నటించిన సన్నాఫ్ కృష్ణన్‌ను మరోసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇక మోస్ట్ ఎవైటెడ్ రీ రిలీజ్‌గా మారింది ఏ మాయ చేశావే. మాజీ వైఫ్ అండ్ హస్బెండ్ సామ్ అండ్ చైతూ నటించిన ఫస్ట్ మూవీ ఏమాయ చేశావే కూడా జులై 18నే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇవే కాకుండా అడపా దడపా వచ్చే చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
NEET Exam: “నాకు నీట్ కాదు, బురఖానే ముఖ్యం”.. పరీక్ష రాయనన్న ముస్లిం విద్యార్థిని.
-
Spirit: చంచల్‌గూడ జైలులో ప్రభాస్.. ‘స్పిరిట్’ సరికొత్త అప్డేట్తో ఫ్యాన్స్‌కు పూనకాలే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
-
PM Modi: నీట్ విద్యార్థుల కోసం ఎయిర్‌పోర్టులోనే ఆగిన ప్రధాని మోడీ..
-
Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!