Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju: తాను డిస్ట్రిబ్యూట్ చేసిన యశ్ చిత్రం ‘టాక్సిక్’ వల్ల భారీగా నష్టపోయానంటూ జరిగిన ప్రచారం అంతా ఉద్దేశపూర్వకంగా చేసిన పెయిడ్ గేమ్ అని టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కుండబద్దలు కొట్టారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్లో చేరిన విజువల్ వండర్ ‘రామాయణ’ తెలుగు రాష్ట్రాల పంపిణీ రైట్స్‌ను దిల్ రాజు సొంత సంస్థ ఎస్వీసీ (SVC) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తనపై జరిగిన నెగెటివ్ ప్రచారానికి ఘాటుగా బదులిచ్చారు.
‘రామాయణ’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారా అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చారు. “సక్సెస్ వస్తేనే ఎనర్జీ వస్తుంది, డబ్బు వస్తుంది. కానీ, గతంలో నేను ‘టాక్సిక్’ సినిమా చేస్తే, నాకేదో మొత్తం నష్టం జరిగిపోయినట్టు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రమోషన్స్ చేశారు. మీ అందరికీ తెలవదా ఏంటి? తెలియనట్టు అమాయకమైన ప్రశ్నలు వేయొద్దు.. ఇప్పుడు ఇండస్ట్రీ కల్చర్ అలా తయారైంది” అంటూ చెప్పుకొచ్చారు. అసలు ‘టాక్సిక్’ విషయంలో తనకు నష్టమే రాలేదని దిల్ రాజు స్పష్టం చేశారు. “‘రామాయణ’ డిస్ట్రిబ్యూషన్ చేశాను, దీంట్లో నాకు మంచి లాభం వచ్చింది. అలాగే ‘టాక్సిక్’ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాను. దాంట్లో నాకు ఎలాంటి నష్టం లేదు, ఎంతోకొంత లాభమే వచ్చింది. పని చేసినందుకు ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ పర్సెంటేజ్ నాకు ‘టాక్సిక్’లో కూడా వచ్చింది” అని ఆయన లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Pawan Kalyan - Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న 'వకీల్ సాబ్' కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
- Varanasi: 'వారణాసి' రిలీజ్‌పై కొత్త బజ్.. జక్కన్న కన్ను ఆ స్లాట్పైనేనా?
- OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
- Box Office Records: పుష్ప టూ రామాయణ.. రూ.1000 కోట్ల క్లబ్‌లోకి వేగంగా చేరిన 8 సినిమాలు ఇవే..
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
-
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు ఎంతో అనుకూలం
-
UP Elections 2027: యూపీలో బీజేపీదే పైచేయి.. సీఎంగా యోగికే మద్దతు.. లేటెస్ట్ సర్వేలో కీలక విషయాలు..
-
Assam: అస్సాంలో ఘోర ప్రమాదం.. ట్రక్కు–మినీ బస్సు ఢీ, 23 మంది మృతి!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?