Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!

Dil Raju

Dil Raju

Dil Raju: తాను డిస్ట్రిబ్యూట్ చేసిన యశ్ చిత్రం ‘టాక్సిక్’ వల్ల భారీగా నష్టపోయానంటూ జరిగిన ప్రచారం అంతా ఉద్దేశపూర్వకంగా చేసిన పెయిడ్ గేమ్ అని టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కుండబద్దలు కొట్టారు. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల క్లబ్‌లో చేరిన విజువల్ వండర్ ‘రామాయణ’ తెలుగు రాష్ట్రాల పంపిణీ రైట్స్‌ను దిల్ రాజు సొంత సంస్థ ఎస్‌వీసీ (SVC) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో తనపై జరిగిన నెగెటివ్ ప్రచారానికి ఘాటుగా బదులిచ్చారు.

‘రామాయణ’ విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చారా అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు దిల్ రాజు స్ట్రెయిట్ కౌంటర్ ఇచ్చారు. “సక్సెస్ వస్తేనే ఎనర్జీ వస్తుంది, డబ్బు వస్తుంది. కానీ, గతంలో నేను ‘టాక్సిక్’ సినిమా చేస్తే, నాకేదో మొత్తం నష్టం జరిగిపోయినట్టు పెద్ద ఎత్తున పెయిడ్ ప్రమోషన్స్ చేశారు. మీ అందరికీ తెలవదా ఏంటి? తెలియనట్టు అమాయకమైన ప్రశ్నలు వేయొద్దు.. ఇప్పుడు ఇండస్ట్రీ కల్చర్ అలా తయారైంది” అంటూ చెప్పుకొచ్చారు. అసలు ‘టాక్సిక్’ విషయంలో తనకు నష్టమే రాలేదని దిల్ రాజు స్పష్టం చేశారు. “‘రామాయణ’ డిస్ట్రిబ్యూషన్ చేశాను, దీంట్లో నాకు మంచి లాభం వచ్చింది. అలాగే ‘టాక్సిక్’ కూడా డిస్ట్రిబ్యూషన్ చేశాను. దాంట్లో నాకు ఎలాంటి నష్టం లేదు, ఎంతోకొంత లాభమే వచ్చింది. పని చేసినందుకు ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ పర్సెంటేజ్ నాకు ‘టాక్సిక్’లో కూడా వచ్చింది” అని ఆయన లెక్కలతో సహా క్లారిటీ ఇచ్చారు.