Site icon NTV Telugu

Dil Raju : అన్నీ సెట్ చేస్తే, రెండేళ్లలో ఇండస్ట్రీ పుంజుకుంటుంది !

Podcast Show Dil Raju

Podcast Show Dil Raju

తెలుగు సినీ ప్రేమికులకు దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేకపోతున్నారు. సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం అనే సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ, అదే సమయంలో విడుదలైన గేమ్ చేంజర్ పరాజయం పాలవడంతో రికవరీ కష్టమైంది. ఆ సంగతి అలా ఉంచితే, ఆయన తాజాగా తమ్ముడు అనే సినిమాతో నితిన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీవీకి ప్రత్యేకంగా పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన సినీ పరిశ్రమ గురించి, తన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Vijay Sethupathi : నా కొడుకు చేసిన పనికి క్షమించండి..

“ఇప్పటికైనా ఇండస్ట్రీ మేల్కొనకపోతే భారీ నష్టం జరుగుతుంది. అన్నీ సెట్ చేస్తే, రెండేళ్లలో ఇండస్ట్రీ మళ్లీ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉంటుంది,” అని దిల్ రాజు అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “పాన్ ఇండియా సినిమాలు కాదు, మన సినిమాలను పాన్ ఇండియా రేంజ్‌లో తీయాలి. పుష్ప, KGF, బాహుబలి, కాంతారా వంటి సినిమాలు అలా తీసినవే,” అని అన్నారు. హీరోలను కూర్చోబెట్టి రియాలిటీ వివరించి, సినిమాలు తీయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Exit mobile version