Site icon NTV Telugu

Dil Raju: సినిమా చూసి ఏడ్చేసిన దిల్ రాజు?

Dil Raju

Dil Raju

గతంలో పలు సినిమాల్లో కమెడియన్ గా కనిపించి జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు ధనరాజ్. ధనాధన్ ధన్రాజ్ అనే పేరుతో కొన్ని వందల స్కిట్స్ చేయడమే కాదు కొన్ని పదుల సంఖ్యలో సినిమాల్లో కూడా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బలగం వేణు దర్శకుడిగా మారిన తర్వాత ఆయన స్ఫూర్తితో ధనరాజ్ కూడా దర్శకుడు అవుతున్నాడు. ఆయన దర్శకుడిగా సముద్రఖని ప్రధాన పాత్రలో రామం రాఘవం అనే సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో ధనరాజ్ సముద్రఖని కుమారుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Pushpa 2: ఒకరు కాదు ఇద్దరు.. ఈసారి ఐటెం నెంబర్ కి శివాలే!

ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా పెట్టుకుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ప్రసాద్ ల్యాబ్ లో దిల్ రాజు కోసం స్పెషల్ షో వేశారు. ఇక ఈ సందర్భంగా సినిమా చూస్తూ రెండు మూడు చోట్ల భావోద్వేగానికి గురై దిల్ రాజు కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత దర్శకుడు ధనరాజ్ ని పిలిచి సినిమా బాగా చేశావని ప్రశంసలు కురిపించాడని అంటున్నారు. ఇక ఈ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది

Exit mobile version