ఎన్టీఆర్‌కు సెంటిమెంట్ అనుకున్నది కూడా కలిసి రాలేదు. వార్ 2 టీజర్, ట్రైలర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు నచ్చకపోయినా, బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ పఠాన్, జవాన్తో పోలిస్తే కొత్తగా అనిపించకపోయినా, ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా ఉన్నారు. సెంటిమెంట్‌తో హిట్ కొడతాడనుకుంటే, ఈసారి మాత్రం వర్కవుట్ కాలేదు. ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ వార్ 2 నిరాశపరిచింది. తారక్ హిందీలోకి అడుగుపెట్టాడన్న ఫ్యాన్స్ ఆనందంపై టీజర్ నీళ్లు చల్లింది. సాదాసీదా స్పై థ్రిల్లర్‌లాగే ఉన్నా, ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్‌లో కనిపించడంతో, వార్ 2 పక్కా హిట్ అని ధీమాతో ఉన్న అభిమానులకు సెంటిమెంట్ కూడా హ్యాండిచ్చింది.
Also Read: Alia Bhatt: వీడియోలు వైరల్.. అలియా భట్ ఆగ్రహం
ఎన్టీఆర్ సిక్స్‌ప్యాక్ చూపించిన సినిమాలన్నీ హిట్ కావడంతో, వార్ 2 రిజల్ట్‌పై ధైర్యంగా ఉన్నారు అభిమానులు. కెరీర్ మొదట్లో బొద్దుగా ఉండే తారక్, సన్నబడ్డా సిక్స్‌ప్యాక్ ట్రై చేయలేదు. టెంపర్ సినిమాతో ఫస్ట్ టైమ్ సిక్స్‌ప్యాక్ బాడీతో ముందుకొచ్చాడు. తారక్ సిక్స్‌ప్యాక్ బాడీతో వస్తే, ఫ్యాన్స్‌కు పండుగే. అరవింద సమేత వీర రాఘవలో ఏకంగా షర్ట్ తీసేసి యాక్షన్ సీన్ చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌లో ఇంట్రడక్షన్ సీన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అడవుల్లో చొక్కా లేకుండా తారక్‌ను రోజుల తరబడి పరిగెత్తించాడు రాజమౌళి.
Also Read: Item Songs : ఐటంసాంగ్స్‌ను కబ్జా చేస్తున్న స్టార్ హీరోయిన్స్
ఈ లెక్కలన్నీ వేసుకున్న అభిమానులు, వార్ 2 హిట్ అవుతుందని సోషల్‌మీడియాలో చేసిన ప్రచారం బెడిసికొట్టింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ కోసం ఎన్టీఆర్ సన్నబడ్డాడు. మొహం పీక్కుపోతున్నా, కండలు పెంచుతున్నాడు. సినిమాలోని యాక్షన్ సీన్స్‌లో మరోసారి చొక్కా లేకుండా కనిపిస్తాడట. అందుకే ఇంతలా మారాడన్న టాక్ ఫిల్మ్ వర్గాల్లో నడుస్తోంది. తారక్ ఫేస్‌లో కళ లేకుండా ఫ్యాన్సే చూడలేమంటున్నారు. మరి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌కు ఎలాంటి ఎలివేషన్ ఇస్తాడో చూడాలి మరి.
