Site icon NTV Telugu

Dhurandhar : పాకిస్థాన్’లో ధురంధర్ పైరసీ రికార్డ్

Dhurandhar

Dhurandhar

బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాకుండా, పైరసీ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్‌లో ఒక అరుదైన, అంతకంటే దారుణమైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్‌లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయని అంచనా.

Also Read: Pawan Kalyan – NTR : ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు

త రెండు దశాబ్దాల కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఈ స్థాయిలో పైరసీ డౌన్‌లోడ్లు రాలేదు. షారుఖ్ ఖాన్ నటించిన రయీస్ చిత్రం గతంలో పాకిస్తాన్‌లో భారీగా పైరసీకి గురైంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 కూడా అప్పట్లో రికార్డు స్థాయిలో ఇల్లీగల్ డౌన్‌లోడ్లను నమోదు చేసుకుంది. ఇప్పుడు ‘ధురంధర్’ ఆ రెండు సినిమాల రికార్డులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.

Also Read:Sharath Kumar : విజయ్‌ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, స్పై, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల నేపథ్యంలో సాగుతుంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకమైన కంటెంట్ ఉందన్న కారణంతో అక్కడి సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. అయితే, ఈ నిషేధమే అక్కడి ప్రేక్షకులలో మరింత కుతూహలాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. థియేటర్లలో చూసే అవకాశం లేకపోవడంతో, టోరెంట్స్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సినిమాను వీక్షిస్తున్నారు. పాకిస్తాన్‌లోని ల్యారీ ప్రాంతంలో మాఫియాలో ఎంటర్ అయి ఉగ్రవాద రహస్యాలను భారత్ కి పంపే భారతీయ గూఢచారి కథ ఇది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై క్రేజ్ పెంచింది. పైరసీ ప్రభావం ఉన్నప్పటికీ, భారత్ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా ఇప్పటికే ₹500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాకిస్తాన్‌లో అధికారికంగా విడుదల కాకపోయినా, ఈ స్థాయి ‘పైరసీ హిట్’ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version