Dhurandhar 2 Release: పెద్ద ప్లానింగే.. 5 భాషలలో ‘ధురంధర్-2’ విడుదల!
- బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోన్న ధురంధర్
- 2025లోనే బిగ్గెస్ట్ ఇండియన్ హిట్‌గా ధురంధర్
- 5 భాషలలో ధురంధర్-2 విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్షయ్ ఖన్నా, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధురంధర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ చిత్రాలను వెనక్కి నెట్టి.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా హిందీలో మాత్రమే విడుదలైనప్పటికీ.. వరుసగా 3 వారాల పాటు రూ.20 కోట్లకు పైగా (సుమారు $200 మిలియన్లు) వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారతదేశంలో కూడా ధురంధర్ సినిమాకు మంచి ఆదరణ దక్కింది. మౌత్ టాక్, సోషల్ మీడియా ట్రెండ్స్ ఈ సినిమాను పాన్-ఇండియా మూవీగా మార్చాయి. ఈ భారీ విజయంతో మేకర్స్ పెద్ద ప్లాన్ వేశారు.
డిసెంబర్ 5న హిందీలో విడుదలైన ధురంధర్ చిత్రం 2025లోనే బిగ్గెస్ట్ ఇండియన్ హిట్‌గా నిలిచింది. ధురంధర్ విజయంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ధురంధర్-2’ను 2026న ఈద్ సందర్భంగా మార్చి 19 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ బుధవారం అధికారికంగా ప్రకటించారు. దక్షిణాదిలోని పంపిణీదారులు, ప్రేక్షకుల డిమాండ్‌ను గుర్తించిన నిర్మాతలు ధురంధర్-2 ను మొదటి రోజే నాలుగు ప్రధాన ప్రాంతీయ భాషలలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ధురంధర్ సీక్వెల్ విడుదల కానుంది.
Also Read
- ToxicTheMovie : 'టాక్సిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
- Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
- Jason Sanjay: విజయ్ బాటలో జాసన్ సంజయ్.. నటుడిగా ఎంట్రీపై ఫస్ట్ టైమ్ క్లారిటీ!
- Zombie Reddy 2: తేజ సజ్జ బర్త్‌డేకు ‘జోంబీ రెడ్డి 2’ బిగ్ సర్ప్రైజ్.. ప్రశాంత్ వర్మ హిట్‌కు సీక్వెల్ రెడీ!
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేటితో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ!
2026 ఈద్ సందర్భంగా విడుదల కానున్న ధురంధర్-2.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా రణ్వీర్ సింగ్ స్టార్ పవర్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యం. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా.. జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రణ్వీర్ గూఢచారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లలో ఆయన నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్ లాంటి స్టార్స్ పెర్ఫార్మెన్స్ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. ధురంధర్ 20 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ.935 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఐదు భాషల్లో రిలీజ్ కానున్న ధురంధర్-2 ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
ToxicTheMovie : ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రమాదం: సౌండ్ బాక్స్‌లు కూలి విద్యార్థులకు గాయాలు
-
Taapsee vs Kangana: ‘పెంపకం’ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న కంగనా-తాప్సీ వార్.. ఇన్‌స్టాలో ఫైర్ బ్రాండ్ కౌంటర్!
-
Onion Price Hike: కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధరలు.. కిలో రూ.70 వరకు విక్రయం!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!