Dhurandhar 2: ఒక్క రికార్డ్ కూడా మిగిలేలా లేదు.. పుష్ప రికార్డ్ బ్రేక్, నెక్స్ట్ బాహుబలి!

Dhurandhar, Pushpa, Aditya Dhar, Ranveer Singh, Baahubali, Sara Arjun, Dhurandhar The Revenge

Dhurandhar, Pushpa, Aditya Dhar, Ranveer Singh, Baahubali, Sara Arjun, Dhurandhar The Revenge

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తోంది. వీకెండ్ ముగిసినా, వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శించడం విశేషం. సోమవారం ఒక్క రోజే ఇండియాలో రూ. 65 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 829 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇందులో భారతదేశం నుంచే రూ. 519 కోట్ల నెట్, రూ. 619 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్లో రూ. 210 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. మొదటి వీకెండ్‌లోనే రూ. 761 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం వారం రోజులు కంప్లీట్ అయ్యేలోపు వెయ్యి కోట్ల మార్క్‌ టచ్ చేసేలా ఉంది.

Also read: Anil Ravipudi: దూసుకొస్తున్న అనిల్ రావిపూడి.. అప్పుడే సెట్స్‌పైకి!

ఇదిలా ఉంటే.. ఇండియన్ ఫ్రాంచైజీ చిత్రాల పరంగా ‘ధురంధర్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఫ్రాంచైజీ రెండు భాగాలు కలిపి రూ. 2000 కోట్ల వసూళ్లు సాధించగా, ‘ధురంధర్’ ఫ్రాంచైజీ కేవలం ఐదు రోజుల్లోనే రూ. 2100 కోట్లు రాబట్టింది. దీనితో భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన 3వ అతిపెద్ద ఫ్రాంచైజీగా ధురంధర్ అవతరించింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’ క్రేజ్ చూస్తుంటే, త్వరలోనే రెండో స్థానంలో ఉన్న ‘బాహుబలి’ ఫ్రాంచైజీ పేరిట ఉన్న రూ. 2400 కోట్ల రికార్డ్ కూడా బద్దలయ్యేలా కనిపిస్తోంది. ఈ లిస్ట్‌లో YRF స్పై యూనివర్స్ ఫ్రాంజైజీ రూ.3195 కోట్ల‌తో టాప్ ప్లేస్‌లో ఉంది. మొత్తంగా.. లాంగ్ రన్‌లో ధురంధర్ సినిమా మరిన్ని అద్భుతాలు సృష్టిస్తుందని, రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ కావడమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లైఫ్‌ టైం కలెక్షన్స్‌ పరంగా బాహుబలి 2, పుష్ప 2తో పాటు టాప్ ప్లేస్‌లో ఉన్న దంగల్ రికార్డ్ కూడా బ్రేక్ చేసేలా ఉంది ధురంధర్ 2.

Also read: Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవండి!