చియాన్ విక్రమ్ నటించిన ధృవనక్షత్రం థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమైనా సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు తెలిసింది.ధృవనక్షత్రం డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ నలభై కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమా తెలుగు మరియు తమిళంతో పాటు మిగిలిన భాషల స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. విక్రమ్ సినిమాలకు ఉన్న పాపులారిటీ కారణంగా నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం.దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌తో ధృవనక్షత్రం సినిమా తెరకెక్కింది. ఓటీటీ హక్కుల ద్వారానే ఈ మూవీ సగానికిపైగా రికవరీ అయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి…
ధృవనక్షత్రం మూవీ 2017లో షూటింగ్ మొదలైంది. షూటింగ్‌తో పాటు విడుదల తేదీలో ఇబ్బందుల వల్ల దాదాపు ఆరేళ్లు రిలీజ్ ఆలస్యం అయ్యింది. ఈ సినిమా నిర్మాతలు మధ్యలోనే వైదొలగడంతో దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. 2023 నవంబర్ 24న ధృవనక్షత్రం విడుదల అవుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించారు. విక్రమ్‌తో పాటు ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్, పార్తిబన్ ప్రధాన పాత్రలను పోషిస్తోన్నారు. ఈ సినిమాలో విక్రమ్ జాన్, ధృవ్ అనే డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో నటించారు.ధృవనక్షత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కాబోతోంది. రెండు భాగాల షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. సెకండ్ పార్ట్‌ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేందుకు గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నారు. ధృవనక్షత్రం సినిమాకు హరీస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు..మరో వైపు చియాన్ విక్రమ్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం తంగలాన్ . ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జనవరి 26, 2024లో విడుదలక సిద్ధం అవుతోంది.ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు టీజర్ విడుదలైంది. టీజర్ మాత్రం అదిరే విజువల్స్‌తో కేక పెట్టించింది.. సినిమాలో విక్రమ్ నట విశ్వరూపం చూపించారు..