The Girlfriend : రష్మికతో పని చేయడం ఓ అందమైన అనుభవం: హీరో దీక్షిత్ శెట్టి
‘ప్రేమను మరో కోణంలో చూపించే చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అంటూ హీరో దీక్షిత్ శెట్టి ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో, రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన దీక్షిత్ తన అనుభవాలను పంచుకున్నారు. “సాధారణంగా మనం వినోదం కోసం సినిమాలు చూస్తాం. కానీ కొన్ని సినిమాల్లోని ఫీల్ మాత్రం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మన మనసులో మిగిలిపోతుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అలాంటి సినిమా. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు మన జీవితాల్లోని అనుభవాల్లా అనిపిస్తాయి. రష్మిక ఈ సినిమాపై ఎంతో ప్యాషన్‌తో పనిచేసింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట నాకు చాలా నచ్చింది ‘కొన్నేళ్ల క్రితం ఇలాంటి సినిమా చూసుంటే నా జీవితంపై దృష్టికోణం మరోలా ఉండేదేమో’ అని. ఆ మాటే ఈ కథ ఎంత లోతైనదో చెబుతోంది” అని అన్నారు.
Also Read : Vijay Devarakonda : ‘రౌడీ జనార్దన’లో సీనియర్ హీరోయిన్ ఎంట్రీ?
అలాగే తన పాత్ర గురించి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను విక్రమ్ అనే టాక్సిక్ బాయ్‌ఫ్రెండ్ పాత్రలో కనిపిస్తాను. చాలా రియలిస్టిక్‌గా, ప్రతి యువకుడి జీవితంలో ఏదో ఒక దశలో కనిపించే స్వభావాన్ని ప్రతిబింబించే పాత్ర ఇది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గారు నన్ను ఈ రోల్ కోసం ఎంచుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ‘దసరా’ సినిమా ఇంటర్వ్యూల్లో నన్ను చూసి ఈ కథకు సరిపోతానని ఆయన అనుకున్నారని చెప్పారు. ఆ నమ్మకానీ నెరవేర్చానని అనిపిస్తుంది”. రష్మికతో పని చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు ఆసక్తికరంగా మారాయి.. “రష్మికతో పనిచేయడం నిజంగా ఓ అందమైన అనుభవం. ఆమె స్టార్ అయినా, సెట్లో అందరితో చాలా ఫ్రెండ్లిగా, సింపుల్‌గా ఉంటుంది. ‘యానిమల్’ సినిమా పెద్ద హిట్ అయిన టైమ్‌లో మేము ఈ సినిమా చేస్తున్నాం. అయినా ఆమె ఎక్కడా ఆ స్టార్ ఫీలింగ్ రానివ్వలేదు. తెరపై ఆమె నటన చూసినప్పుడు రష్మిక కంటే భూమ అనే పాత్రే కనిపిస్తుంది. ఆమె ఆ పాత్రలో పూర్తిగా మునిగిపోయింది” అని అన్నారు. అంతేకాదు “నా నటన చూసి అల్లు అరవింద్ గారు ప్రత్యేకంగా ప్రశంసించి, మరో సినిమాకి అడ్వాన్స్ ఇచ్చారు. అది నాకు పెద్ద గౌరవం. భవిష్యత్తులో కూడా అలాగే విభిన్నమైన కథల్లో, వైవిధ్యభరితమైన పాత్రలో నటించాలని కోరుకుంటున్నా,” అని దీక్షిత్ చెప్పుకొచ్చారు. ప్రజంట్ దీక్షిత్ మాటలు వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
-
US-Iran Talks: నిర్మానుష్యంగా పాకిస్తాన్ రాజధాని.. ఇస్లామాబాద్ లాక్డౌన్
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?