టాలీవుడ్ నటుడు ధర్మ మహేష్ తన ఫుడ్ వెంచర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. డిసెంబర్ 11, 2025న గుంటూరులో ‘జిస్మత్ జైల్ మండి’ మూడో బ్రాంచ్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకకు వెయ్యి మందికి పైగా అభిమానులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి తరలివచ్చారు. వేదిక వద్దకు చేరుకున్న ధర్మ మహేష్‌కు అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మహేష్ తల్లి అరుణ, తండ్రి కాకాని వెంకటేశ్వర రావు, సోదరి కాకాని భాగ్య లక్ష్మి, జిస్మత్ లీగల్ అడ్వైజర్ మరియు హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ధర్మ మహేష్ 2017లో గుంటూరులో ‘గిస్మత్ అరబిక్ మండి’ స్థాపనతో తన ఫుడ్ వెంచర్ ప్రారంభించారు. తన ప్రత్యేకమైన ‘జైల్ మండి’ మరియు ‘అరబిక్ మండి’ కాన్సెప్ట్‌లతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఈ బ్రాండ్ ప్రాచుర్యం పొందింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ బ్రాండ్ 17కు పైగా బ్రాంచ్‌లకు విస్తరించి, ప్రామాణికమైన రుచులు, విలక్షణమైన డైనింగ్ అనుభవంతో బలమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో మహేష్ తన యాజమాన్య వ్యాపారాన్ని గిస్మత్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌గా మార్చారు. కంపెనీ పేరును ‘గిస్మత్’ నుంచి ‘జిస్మత్’గా మార్చారు. తన కుమారుడు ఝగద్వజ పేరులోని మొదటి అక్షరం ‘J’ వచ్చేలా పేరు మార్పు చేయడం జరిగింది.