తమిళ సినీ పరిశ్రమ నుంచి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్ తర్వాత హిందీ, తెలుగు అంటూ వరుసగా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో సార్ సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన తర్వాత కుబేర అనే సినిమా కూడా చేశాడు. అలాగే ఆయన తేరే ఇష్క్ మే అనే మరో హిందీ ప్రాజెక్ట్ కూడా సిద్ధం చేశాడు. ఈ సినిమాలో ఆయన కృతితో కలిసి నటించాడు.
Also Read:Hrithik -NTR: చావో రేవో తేలాలిపుడే డ్యాన్స్!
రెహమాన్ మ్యూజిక్ అందించగా ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆయన చేస్తున్న హిందీ ప్రాజెక్ట్ పూర్తయింది. అయితే ఇప్పుడు ఒక సంచలనం ఏమైందంటే నిజానికి కుబేర సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి.
Also Read:India vs Bangladesh Series : ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ జరిగేనా…
కానీ తమిళనాడులో మాత్రం మినిమం ఇంపాక్ట్ కూడా చూపించడంలో ఫెయిల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆయన ముందుగా తమిళంలో తన మార్కెట్‌ని మరింత స్ట్రాంగ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ఇప్పట్లో ఇతర భాషల సినిమాలు చేయకుండా తమిళ భాషలోనే సినిమాలు చేసి మార్కెట్ బలపరుచుకునే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. తన మార్కెట్ బలపరిచిన తర్వాత ఇతర భాషల సినిమాల మీద ఆయన ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లుగా సమాచారం.
