ఓటీటీలో ధనుష్ హిందీ సినిమా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ నటించిన ‘జగమే తంత్రం’ సినిమా ఈ యేడాది థియేటర్లలో కాకుండా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న స్ట్రీమింగ్ అయ్యింది. ధనుష్ అభిమానులు ఈ విషయంలో కాస్తంత నిరాశకు గురైనా, ఒకే సమయంలో 190 దేశాలలో 17 భాషల్లో ఈ సినిమా డబ్బింగ్ అయ్యి విడుదల కావడం వారికి కొంత ఓదార్పును కలిగించింది. ఇప్పుడు మళ్ళీ అదే కథ పునరావృతం కాబోతోంది. ధనుష్ నటించిన తాజా హిందీ చిత్రం ‘అత్రంగీ రే’ డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్ కాగా అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. ఎ. ఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చాడు. టీ సీరిస్ తో పాటు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ప్రేమకు పరాకాష్టగా నిలిచే ఈ సినిమాను ఈ యేడాది వేలంటైన్స్ డే రోజున విడుదల చేయాలని అనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అయ్యింది. దాంతో ఆగస్ట్ 6న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అప్పటికీ థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఇక లాభం లేదని నిర్మాతలు డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కు రెడీ అయిపోయారు. బుధవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ‘రాంఝానా, షమితాబ్’ చిత్రాలతో బాలీవుడ్ ఆడియెన్స్ మనసుల్ని కొల్లగొట్టిన ధనుష్ ఈసారి ఏ స్థాయి గుర్తింపు తెచ్చుకుంటాడో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!