ఆకట్టుకుంటున్న ‘ధమాకా’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా కారణంగా డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదల కాబోతున్న మరో బాలీవుడ్ సినిమా ‘ధమాకా’. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఈ సినిమాను ముందు థియేట్రికల్ గా విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ‘ప్రశాంతంగా ఉండండి. అర్జున్ పాఠక్ పై భరోసా ఉంచండి. #ధమాకా లోడ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ లో నవంబర్ 19 న వస్తున్నాము’ అని ట్రైలర్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ‘ధమాకా’ సినిమా టెలివిజన్ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిది.
ఒక బ్రిడ్జ్ ని పేల్చిన ఉగ్రవాదిని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ఎలాంటి బెదిరింపులు అందుకున్నాడు. ఆ తర్వాత అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నది ఈ సినిమా కథాంశం. కార్తీక్ ఆర్యన్ తో పాటు మృణాల్ ఠాకూర్, అమృత సుభాష్ ముఖ్య పాత్రధారులు. 2013లో వచ్చిన ‘ద టెర్రర్ లైవ్’ అనే కొరియన్ సినిమా ఆధారంగా ‘ధమాకా’ను తెరకెక్కించారు. ‘నీర్జా’ ఫేమ్ రామ్ మాధ్వాని దీనికి దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా, అమిత మద్వానీ, రామ్ మద్వాని నిర్మించిన ఈ సినిమా నవంబర్ 19 న నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుంది.
Also Read
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
- Sampoornesh Babu: 'కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ 'ది ప్యారడైజ్' కే మోగింది!'.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
తాజావార్తలు
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
-
Banks Merged: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. మరో రెండు బ్యాంకులు విలీనం..!
-
Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
-
Mohan Babu: “నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో”
-
Iran-US: అమెరికాకు ఇరాన్ తాజా హెచ్చరిక.. ఈసారి చిన్న తప్పు చేసినా..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?