టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌ల్లో దేవి శ్రీ ప్రసాద్ ఒక్కరు. 25 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన సంగీతంతో కట్టిపడేస్తున్న ఆయన ఇప్పటివరకు 100కు పైగా సినిమాలకు పని చేశారు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్స్‌ను అందించారు. క్లాస్, మాస్, లవ్, రొమాంటిక్, యాక్షన్ ఏదైనా సరే తన స్టైల్‌లో సౌండ్ ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అందిస్తూ దుమ్ము లేపుతాడు. కేవలం తెలుగులోనే కాదు.. ఇటు తమిళ్, హిందీ లో కూడా తన మ్యూజిక్ సత్తా చాటాడు. ‘దేవి’ చిత్రంతో మొదలైన ఆయన మ్యూజిక్ కెరియర్, ఇప్పటికీ నిరాటకంగా కొనసాగుతూనే వస్తోంది. ఆ మధ్య కాస్త డౌన్ అయిన దేవి శ్రీ ప్రసాద్ తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. రీసెంట్‌గా తమిళంలో కంగువా, తెలుగులో పుష్ప 2, తండేల్ చిత్రంతో ఆరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా దేవి కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
Also Read: Mrunal Thakur : ఛలో ముంబై అంటున్న మృణాల్
ఏంటంటే దేవిశ్రీప్రసాద్ తన కెరియర్లో రీమేక్ సాంగ్స్ చేయకూడదు అని గట్టి నియమం పెట్టుకున్నాడట. ఆ రూల్‌ను ఇప్పటి వరకు తన ఈ 25 ఏళ్ల కెరియర్లో ఎప్పుడు బ్రేక్ చేయలేదంట. అందుకే రీమేక్ సాంగ్స్ ఉన్న సినిమాలను ఆయన తిరస్కరిస్తూ వచ్చారంట. ఈ క్రమంలోనే మెగా హీరో వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేష్’ మూవీ ఆఫర్ కూడా తొలుత దేవిశ్రీ ప్రసాద్‌కే వచ్చింద. కానీ ఇందులో ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ పాటను రీమేక్ చేశారు. ఈ పాట కారణంగా ఆయన ఆ మూవీ కి నో చేప్పరట.