టాలీవుడ్‌లో కేవలం ఒక్క సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన హీరోయిన్‌లు కొందరు ఉన్నారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్ కి జంటగా ‘సీతా రామం’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ‘హాయ్ నాన్న’ మూవీతో మరింత ఆకట్టుకుంది. పదేళ్ళ నుంచి బాలీవుడ్‌లో ఉన్నా రాని పేరు.. తెలుగులో రెండంటే రెండు సినిమాలతోనే తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్. నార్త్‌లో అరడజన్ సినిమాలు.. దానికి ముందు సీరియల్స్ చేసినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటిది ఆమె మంచి మార్కెట్ అందించిన సౌత్ వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
Also Read: Tharun Bhascker : ‘ఈ నగరానికి ఏమైంది 2’ గురించి హింట్ ఇచ్చిన తరుణ్ భాస్కర్
ఈ మధ్య ఫోటోషూట్స్‌లోనూ గ్లామర్ డోస్ భారీగానే పెంచిన మృణాళ్ ఠాకూర్ బాలీవుడ్ ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టింది. అల్‌రెడి హిందీలో ‘సంజయ్ లీలా భన్సాలీ’ నిర్మాణంలో ఒక రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో పాటు, ‘సన్నాఫ్ సర్దార్ 2’లో నటిస్తున్నారు మృణాళ్. దీంతో పాటుగా మరో 2 సినిమాలు చర్చల దశలో ఉన్నాయట. తెలుగులో ప్రస్తుతం అడివి శేష్‌తో ‘డెకాయిట్’లో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ, ఇక్కడెన్ని ఛాన్సులిచ్చినా.. ఇస్తామని చెప్పినా..మనసు మాత్రం ఛలో ముంబై అని అంటుందట. ఇప్పటికి ఇలా చాలా మంది బాలీవుడ్ హీరోయిన్‌లు ఇలాగే తెలుగులో ఫేమ్ అందుకుని బోంబాయ్ చెక్కేసారు. ఈ లిస్ట్‌లో ఇప్పడు మృణాల్ కూడా చెరినట్లు టాక్ వినపడుతుంది.