Pushpa 2: రిలీజ్ ముందు దేవి శ్రీ బాంబ్?
- రిలీజ్ ముందు దేవి శ్రీ బాంబ్
- పుష్ప రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకా సుమారు 20 రోజుల సమయం
- పుష్ప రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకా సుమారు 20 రోజుల సమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకా సుమారు 20 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్లు. అయితే సరిగ్గా 20 రోజులు ఉందనగా పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక సరికొత్త బాంబు విసిరాడు. అసలు విషయం ఏమిటంటే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన కంగువా అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరూ దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి మైనస్ అయిందని మాటే మాట్లాడుతున్నారు. నిజానికి ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ విషయం మీద చర్చలు కూడా జరుగుతున్నాయి. కావాలని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో సౌండ్ పెంచేశాడు. తప్ప కావాల్సిన ఔట్పుట్ ఇవ్వలేదని వాదన వినిపిస్తోంది. ఈ సినిమా రిసల్ట్ చూసిన తర్వాత దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 కోసం ఏం పని చేశాడు? ఎలాంటి పని చేశాడు? అనే విషయం మీద అనుమానాలు మొదలవుతున్నాయి.
Udaya Shankar: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ హఠాన్మరణం
Also Read
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
- Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
- ChiranjeeviOdela : 'ప్యారడైజ్' రిజల్ట్పైనే చిరంజీవి - శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
అయితే పుష్ప 2 విషయంలో దేవిశ్రీప్రసాద్ గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే ఒక సంగీత దర్శకుడు ఒక్కో సినిమాకి ఒక్కో రకమైన మ్యూజిక్ అందిస్తాడు. కంగువ అనేది పూర్తిగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా కావడంతో దానికి అవసరమైన మేర సంగీతం అందించాడు. అదే పుష్ప 2 అనేది ఎలివేషన్స్ తో కూడుకున్న సినిమా కాబట్టి దానికి వేరేలా అందించే అవకాశం ఉంది. దానికి తోడు ఎస్ఎస్ తమన్ తో పాటు మరో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ కూడా ఈ సినిమాకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రాక్స్ మీద పనిచేస్తున్నారనే వార్తలు వింటూనే ఉన్నాం. కాబట్టి పూర్తిగా పుష్పా 2 మేకర్స్ దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన ఔట్పుట్ మేరకు ముందుకు వెళతారు అనేది నిజమని చెప్పలేం. కాబట్టి ఈ విషయంలో దేవిశ్రీప్రసాద్ పని గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
-
Wedding Date Confirmed: క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ల పెళ్లి తేదీ ఫిక్స్..!
-
China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!