Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సందీప్ రెడ్డి వంగ చిత్రాల ప్రొడక్షన్ విషయాలపై ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. గతంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందుగా సందీప్ రెడ్డి దీపికనే ఎంచుకున్నారని ఆమె టాలెంట్ మీద నమ్మకంతోనే ఆమెను ఎంపిక చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. సుమారు ఏడాదిన్నర పాటు వారు కథ గురించి ట్రావెల్ చేశారని ఆ సమయంలోనే ఆమెకు రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు పడడంతో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే దీపికా పదుకొనే సినిమా నెట్ ఇన్కమ్/లాభాల్లో ఏకంగా 10 శాతం వాటా (షేర్) ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెమ్యునరేషన్ వాటాతో పాటు షూటింగ్ డేట్స్, కాల్షీట్ టైమింగ్స్ విషయంలోనూ ఆమె ఏమాత్రం రాజీపడలేదు. పోనీ అలా డిమాండ్ చేసినా మాకు పెద్దగా ఇబ్బంది అనిపించేది కాదు కానీ ప్రాజెక్టులో ఆమె భాగమైనప్పుడు ఆమెకు కొన్ని కీలకమైన విషయాలు సందీప్ రెడ్డి వెల్లడించాడు ఆ విషయాలను ఆమె కావాలని లీక్ చేయించినట్లు ప్రణయ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఈ తరహా ప్రవర్తన కారణంగా సినిమా గురించి సందీప్ రెడ్డి చేసుకున్న ప్లాన్స్ అన్ని పూర్తిగా తారుమారవుతాయని భావించి, నిర్మాతలుగా తాము ఆమెను పక్కన పెట్టాల్సి వచ్చిందని ప్రణయ్ వివరించారు. ఆ తర్వాతే కథానాయిక పాత్ర కోసం ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూశామని స్పష్టం చేశారు.
Also Read
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?