Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే మరోసారి కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రెండోసారి తల్లి అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యూటీ.. ఇప్పుడు తన పెండింగ్ షూటింగ్స్‌ను పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘కింగ్’, అల్లు అర్జున్ నటిస్తున్న ‘రాకా’ సినిమాల్లో తనకు సంబంధించిన షూటింగ్‌ను దీపికా పూర్తి చేయనుందట.
ప్రెగ్నెన్సీ సమయంలోనూ దీపికా పదుకొణే షూటింగ్స్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. రెండోసారి కన్సీవ్ అయిన తర్వాత కూడా ఆమె కింగ్, రాకా సినిమాల షూటింగ్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన కొంత భాగం షూటింగ్‌ను పూర్తి చేశారు. అయితే డెలివరీ సమయం దగ్గరపడటంతో కొంతకాలం షూటింగ్స్‌కు విరామం ఇచ్చి.. పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు. ఇటీవల మరో పాపకు జన్మనిచ్చిన దీపిక ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read
- Aneet Padda: టాలీవుడ్లోకి 'సైయారా' బ్యూటీ ఎంట్రీ?
- Parvath Anurag: మా రౌడీని ప్రేమించవచ్చు, ద్వేషించవచ్చు.. కానీ మర్చిపోలేరు!
- Fauzi: జీవించేశాడే.. ‘ఫౌజీ’లో సుభాష్ చంద్రబోస్‌గా నటించింది ఎవరో తెలుసా?.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
- Minister Aadhav Arjuna vs Dhanush: హీరో ధనుష్‌పై టీవీకే మంత్రి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదనుకుంటున్నావా..?
అక్టోబర్ 26 నుంచి షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్లో దీపిక పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో భాగంగా ముంబైలో ఓ పాటను చిత్రీకరించనున్నట్లు సమాచారం. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయనున్నట్లు టాక్. ఈ సాంగ్‌లో సినిమాలోని పలువురు ముఖ్య నటీనటులు పాల్గొననున్నారని తెలుస్తోంది. మొదట ఈ పాటను దక్షిణాఫ్రికాలో చిత్రీకరించాలని భావించినప్పటికీ.. దీపికా కాల్షీట్స్ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌ను ముంబైకి మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
కింగ్ సినిమా షూటింగ్ పూర్తయ్యాక దీపికా పదుకొణే రాకా సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. ఆమె కోసం చిత్రబృందం షూటింగ్ షెడ్యూల్స్‌ను రీషఫుల్ చేసినట్లు బీటౌన్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో దీపికకు సంబంధించిన పెండింగ్ సన్నివేశాలను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. 2024లో వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దీపికా.. ఆ తర్వాత మాతృత్వం కోసం కొంతకాలం విరామం తీసుకున్నారు. ఈ ఏడాది చివర్లో ‘కింగ్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది. ఒకవైపు అమ్మతనాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు తన సినీ కెరీర్‌ను కొనసాగించేందుకు దీపిక సిద్ధమవుతున్నారు.
- Tags
- Deepika Padukone
- King
- Raaka
తాజావార్తలు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!