Site icon NTV Telugu

December clash: డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?

Untitled Design (7)

Untitled Design (7)

ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని  ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి.

ఇక రానున్న డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని అందరికంటే ముందుగా డేట్ వేసాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్ కు వేసేలా ప్లాన్ చేసాడు. వారితో పాటు మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ ను కూడా అదేనా నెలలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు నిర్మాత బన్నీ వాసు.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాలు వచ్చేలా లేవు.

ఈ ఏడాది ఆగస్టు 15న రావాల్సిన పుష్ప-2 షూటింగ్ డిలే కారణంగా వెనక్కు జరిగి డిసెంబర్ 6న వస్తున్నామని ప్రకటించారు మేకర్స్. పుష్ప ఆగస్టులో వచ్చేస్తుందని భావించి కన్నప్ప డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసాడు మంచు విష్ణు. పుష్ప వచ్చినా సరే తాము ఆగేదిలేదని కన్నప్ప నిర్మాత మంచు విష్ణు ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటు శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ డిసెంబర్ 25న విడుదల ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది. అటు బాలయ్య సినిమా కూడా డిసెంబర్ లిస్ట్ లో ఉంది. చివరికి డిసెంబర్ రేసులో ఎవరుంటారో ఎవరు తప్పుకుంటారో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

 

Also Read: Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్

Exit mobile version