‘సర్కారు వారి పాట’ టీజర్ కు ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ‘సర్కారు వారి పాట’. 2022 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇటీవల దుబాయ్‌లో మొదటి షెడ్యూల్ ను ఎలాంటి అడ్డంకి లేకుండా పూర్తి చేసుకుంది చిత్రబృందం. తాజాగా హైదరాబాద్ లో మొదలైన రెండవ షెడ్యూల్ షూటింగ్ ను మాత్రం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున రద్దు చేశారు మేకర్స్. మహేష్ హెయిర్ స్టైలిస్ట్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన తర్వాత మహేష్ బాబు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. మరోవైపు ‘సర్కారు వారి పాట’ టీం సూపర్ స్టార్ అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఫస్ట్ లుక్, టీజర్‌ను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ లో హీరోల పుట్టినరోజున సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ ను ఇచ్చే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ… ‘సర్కారు వారి పాట’ టీం మహేష్ బాబు ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31న, మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న టీజర్ ను విడుదల చేయబోతున్నారట. ఈ వార్త ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది.
Also Read
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
- Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?