Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!

Trivikram

Trivikram

దసరా రేసులో సినిమాల సంఖ్య పెరుగుతోంది. పండక్కి వారం ముందు తొమ్మిదిన ఏకంగా మూడు సినిమాలు వస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్న ఒక డబ్బింగ్ మూవీ, ఆయన డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’కి పోటీనిస్తోంది. రెండు కోట్ల బడ్జెట్‌తో తీసిన ‘హనుమాన్ అంశ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ హిందీ సినిమాను తెలుగు ఆడియన్స్ కోసం డబ్బింగ్ చేశారు. తెలుగు వర్షన్‌ని త్రివిక్రమ్ రిలీజ్ చేయాలనుకున్నాడు. టీజర్‌లో గురూజీ పేరు కూడా పడింది. మరి ఏమైందేమో కానీ, త్రివిక్రమ్ డ్రాప్ కావడంతో తెలుగు రిలీజ్ ఆలస్యమైంది. సెప్టెంబర్‌లోనే రావలసిన ‘హనుమాన్ అంశ్’ ఎట్టకేలకు తొమ్మిదిన రిలీజ్ చేస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గురూజీ రిలీజ్ చేయాలనుకున్న హనుమాన్ (హనుమాన్ అంశ్), ఆయన డైరెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’కే పోటీ ఇవ్వటం విశేషం. ‘హనుమాన్ అంశ్’ వరల్డ్‌వైడ్‌గా 400 కోట్లు కలెక్ట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి నెలకొంది. 1900-1973 మధ్యకాలంలో జీవించిన ఆధ్యాత్మిక గురువు, హనుమాన్ భక్తుడు నీమ్ కరోలీ బాబా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. బాబా రోల్‌ని శోభినవ్ సత్య పోషించగా, విశాల్ చతుర్వేది డైరెక్ట్ చేశాడు.

అక్టోబర్ 9న వస్తున్న సినిమాల సంఖ్య మూడుకు చేరింది. ‘ఆదర్శ కుటుంబం’, ‘హనుమాన్ అంశ్’తో పాటు శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ కూడా రిలీజ్ అవుతోంది. ‘ఆదర్శ కుటుంబం’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, ‘కామ్రేడ్ కళ్యాణ్’ నక్సల్ బ్యాక్‌డ్రాప్‌తో కామెడీగా రూపొందింది. ఇక ‘హనుమాన్ అంశ్’ డివోషనల్ బయోపిక్. దసరా పండుగ 20న అయితే, రెండు వారాల ముందే తొమ్మిదిన మూడు సినిమాల రిలీజెస్‌తో సందడి స్టార్ట్ అవుతుంది. ఒక వారం ముందు అక్టోబర్ 15న ‘జైలర్ 2’, 16న ‘రణబాలి’ రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు మరో రెండు చిన్న సినిమాలు ‘నాన్నకుట్టి’, ‘గరివిడి లక్ష్మి’ కూడా బరిలోకి దిగుతున్నాయి. 90వ దశకంలో ఉత్తరాంధ్ర జానపదాలకు ప్రాచుర్యం తీసుకొచ్చిన బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథను అదే పేరుతో నిర్మించారు. ఆనంది టైటిల్ రోల్ పోషించగా, గౌరీ నాయుడు జమ్ము డైరెక్ట్ చేసిన ఈ సినిమా 17న రిలీజ్ అవుతోంది.

దసరా రేస్‌లో ‘హనుమాన్ అంశ్’, ‘జైలర్ 2’ తో పాటు వస్తున్న మరో డబ్బింగ్ మూవీ ‘నాన్నకుట్టి’. విజయ్ ఆంటోనీ లీడ్ రోల్‌లో తండ్రీ-కూతురు అనుబంధంతో రూపొందిన ఎమోషనల్ డ్రామా ‘నాన్నకుట్టి’ అక్టోబర్ 16న రిలీజ్ అవుతుంది. ఇలా దసరా రేస్‌లో చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా ఏడు సినిమాలు వస్తున్నాయి. బాక్సాఫీస్‌లో మరిన్ని అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ‘వేల్’ మూవీ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు. నాగేంద్ర ఆవుల దర్శకత్వంలో క్షత్రియ ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. హిలేరియస్ అడ్వెంచర్‌గా రూపొందుతున్న సినిమా ‘చంద్రయాన్’ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత వేణు ఉడుగుల సమర్పణలో రూపొందిన ఈ సినిమాను 30న థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు.