Vallabhaneni Anil: చిరంజీవి చెప్పిన మాటతో కదిలిన ఫెడరేషన్.. డ్యాన్స్ మాస్టర్స్ గొడవకు ఫుల్ స్టాప్?
- డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం ఫెడరేషన్‌కు చేరింది..
- 19న కీలక సర్వసభ్య సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Anil: తెలుగు సినిమా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్‌లో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తెలుగు ఫిలిం ఫెడరేషన్ దృష్టికి చేరాయి. కార్యవర్గ సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, రాజీనామాలు, ఉప ఎన్నికల డిమాండ్లతో వివాదం ముదురుతుండటంతో ఫెడరేషన్ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించి సంబంధిత వారితో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ఈ వివాదాన్ని వ్యక్తుల మధ్య గొడవగా కాకుండా, యూనియన్ కార్యవర్గానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తున్నామని తెలిపారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పరిస్థితిపై స్పందించి, సమస్యను ఫెడరేషన్ పరిధిలో చర్చించి పరిష్కారం కనుగొనాలని సూచించారని వెల్లడించారు.
ఈ సమావేశానికి డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, కార్యవర్గ సభ్యులు, సంబంధిత ప్రతినిధులను పిలిచి వారి వాదనలు విన్నామని చెప్పారు. అనంతరం ఫెడరేషన్‌కు చెందిన 24 కార్మిక సంఘాల నుంచి ఉన్న 72 మంది కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఏ యూనియన్లోనైనా సమస్యలు వస్తే వాటిని సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిష్కరించడమే ఫెడరేషన్ లక్ష్యమన్నారు. వ్యక్తిగతంగా ఎవరికి మద్దతు ఇవ్వకుండా, అన్ని యూనియన్లకు ఒకే విధమైన నిబంధనలు అమలు చేయడమే తమ విధానమని స్పష్టం చేశారు. అలాగే తప్పు చేసిన వారిపై చర్యలు తప్పకుండా ఉంటాయని, అయితే అవి ఫెడరేషన్ నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Also Read
- Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
- Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత మాత్రం తమ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యం చేసుకునే అధికారం లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. ఇప్పటికే సమర్పించిన రాజీనామాలను ఆమోదించి ఈ నెల 26న ఉప ఎన్నికలు నిర్వహించాలనే తమ నిర్ణయాన్ని ఆమె సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక డ్యాన్సర్లకు చెల్లింపులు, నిర్మాతల నుంచి వసూలు చేస్తున్న పారితోషికాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపైనా చర్చ జరిగినట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలకు, కార్మికులకు న్యాయం జరిగేలా పారదర్శక విధానాన్ని తీసుకురావడంపై కూడా చర్చించామని అనిల్ వెల్లడించారు. ఈ వివాదానికి ముగింపు పలికే దిశగా ఈ నెల 19న ఉదయం 11 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను తీసుకుని తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఫెడరేషన్ సూచనలను యూనియన్ అంగీకరిస్తుందా? లేక ఉప ఎన్నికల దిశగానే ముందుకెళ్తుందా? అనే అంశంపై ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
Ahaana Krishna Wedding: 20 ఏళ్ల వయసులో కలిసిన వ్యక్తినే 30కి పెళ్లాడిన నటి అహానా కృష్ణ.. నిమిష్ రవితో లవ్ స్టోరీ ఇదే!
-
Priyanka Chopra: ఆ ఒక్క మాటతో వెంటనే ఒప్పేసుకున్నా.. రాజమౌళిపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు!
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!