Dacoit Release Date: సాలిడ్ అప్‌డేట్.. ఆరోజే ‘డెకాయిట్’ రిలీజ్!
- అడివి శేష్ ద్విభాషా చిత్రం ‘డెకాయిట్’
- డెకాయిట్ కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన న్యూస్ చక్కర్లు
- ఆరోజే 'డెకాయిట్' రిలీజ్
Dacoit New Release Date: యువ హీరో అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘డెకాయిట్’. షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ముంబై భామ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ డెరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న డెకాయిట్ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
2026 ఉగాదిని పురస్కరించుకుని మార్చి 19న డెకాయిట్ సినిమాని విడుదల చేయాలని చిత్ర యూనిట్ ముందుగా అనుకుంది. ఆ తేదీనే యష్ ‘టాక్సిక్’, రణవీర్ సింగ్ ‘ధురంధర్ 2’ రిలీజ్ అవుతుండడంతో డెకాయిట్ వెనక్కి తగ్గింది. తాజా సమాచారం ప్రకారం.. రిలీజ్ డేట్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేశారట. ఏప్రిల్ 10 డెకాయిట్ రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. నిఖిల్ సిద్దార్థ ‘స్వయంభు’ ఓ వారం గ్యాప్ తర్వాత విడుదల అయ్యే అవకాశం ఉంది. స్వయంభు, డెకాయిట్ సినిమాల నైజాం డ్రిస్టిబ్యూటర్ ఏషియన్ సునీల్ కావడంతో.. రెండింటి మధ్య గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. డెకాయిట్ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Also Read
- NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
- Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
Also Read: ENG vs PAK: భారత్‌కే ఐసీసీ సపోర్ట్, ఇది చాలా అన్యాయం.. ఇంజమామ్ సంచలన ఆరోపణలు!
డెకాయిట్ నుంచి ఇప్పటికే ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఫస్ట్ సింగిల్ ‘రూబరో’ను ఫిబ్రవరి 27న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. గూఢచారి, క్షణం సినిమాలకు పని చేసిన షానియేల్ డియో.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా థ్రిల్లర్ సినిమాలు చేస్తూ వస్తున్న అడివి శేష్.. ఈసారి ప్రేమకథతో వస్తుండడంతో డెకాయిట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
తాజావార్తలు
-
KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!
-
Iranian Attack Indian Crew: ఒమన్ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు
-
Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!