Daaku Maharaj: చిన్ని అంటూ సాంగేసుకున్న డాకు మహారాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాకి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపిస్తున్న ‘డాకు మహారాజ్’పై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్ టీజర్ విశేషంగా ఆకట్టుకున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి, ఇటీవల విడుదలైన మొదటి గీతం ‘ది రేజ్ ఆఫ్ డాకు’కి అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతం చిన్ని విడుదలైంది. బాలకృష్ణ, తమన్ కలయిక అంటే పాటలపై సంగీత ప్రియుల్లో అంచనాలు ఉండటం సహజం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘డాకు మహారాజ్’కి తమన్ అద్భుతమైన సంగీతం అందించారని మొదటి గీతంతోనే అర్థమైంది. ఇక ఇప్పుడు రెండో గీతంతో బాలకృష్ణ-తమన్ కలయిక ఎందుకంత ప్రత్యేకమైనదో మరోసారి స్పష్టమైంది. చిన్ని పాటకు తమన్ అందించిన సంగీతం హృద్యంగా ఉంది. మనసుకి హత్తుకునే ఆ సంగీతానికి తగ్గట్టుగా అనంత శ్రీరామ్ అందించిన సాహిత్యం పాటకు మరింత అందం తీసుకొచ్చింది. ఆయన కలం నుంచి జాలువారిన “నువ్వు తే అంటే నీ ముందు తారా తీరాలే. నువ్వు నవ్వుతుంటే అమావాస్యయినా దీపావళిగా మారాలే.” వంటి సున్నితమైన, సుమధురమైన పంక్తులు కట్టి పడేశాయి. తన మధుర గాత్రంతో గాయకుడు విశాల్ మిశ్రా పాటను మరో స్థాయికి తీసుకెళ్ళారు.
Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ
Also Read
- Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
- Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
- SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే
- The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. 'ది పారడైజ్' సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
లిరికల్ వీడియోని గమనిస్తే అద్భుతమైన విజువల్స్, విశ్వ రఘు ఆకట్టుకునే కొరియోగ్రఫీ చిన్ని పాటకు జీవం పోశాయి. బాలకృష్ణ, చిన్నారి మధ్య భావోద్వేగ మరియు ఉల్లాసభరితమైన బంధాన్ని ఆవిష్కరిస్తూ ఊటీ నేపథ్యంలో ఈ పాటను ఎంతో అందంగా చిత్రీకరించారు. పాప క్షేమం, సంతోషం కోరే రక్షకుడిగా బాలకృష్ణ ఈ ‘చిన్ని’ గీతంలో కనిపిస్తున్నారు. అలాగే లిరికల్ వీడియోలో చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ‘చిన్ని’ అనే ఈ మధుర గీతం బాలకృష్ణపై కుటుంబ ప్రేక్షకులకు, ఈ తరం పిల్లలకు ఉన్న అభిమానాన్ని మరింత పటిష్టం చేస్తుంది అనడంలో సందేహం లేదు. అటు పిల్లలు, ఇటు పెద్దలు మెచ్చేలా ఈ పాట ఉంది. ‘డాకు మహారాజ్’ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు. డాకు మహారాజ్’ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్‌లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!