Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anupama Parameswaran Latest Comments: అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. భద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఖిల్రాజ్, నరేశ్, తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల కాగా.. గురువారం హైదరాబాద్లో చిత్ర బృందం విలేకర్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అనుపమ తన సినిమాల ఎంపిక, నటనపై ఆసక్తి, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను అని, ఓ నటిగా ఎప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలు చేయడానికే ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తన సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు భావించకూడదని, ప్రతి చిత్రంలోనూ తన పాత్ర ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని చెప్పారు.
‘ఓ నటిగా నేను ఎప్పుడూ వైవిధ్యభరితంగా ఉండాలని ప్రయత్నిస్తుంటా. నా సినిమాలన్నీ ఒకేలా ఉన్నాయని ప్రేక్షకులు అస్సలు అనుకోకూడదు. నా పాత్రను చూసే ఆ సినిమా పేరేంటో వెంటనే ప్రేక్షకులు చెప్పగలగాలి. అంత ప్రత్యేకంగా ఉండేలా నా కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటా. కేవలం డబ్బుల కోసమే నటించాలని అనుకోను. ఏదో కొత్తగా ప్రయత్నించాలనే ప్యాషన్ నన్ను నడిపించాలి’ అని అనుపమ పరమేశ్వరన్ చెప్పారు. ‘టిల్లు స్క్వేర్’, ‘పరదా’, ‘క్రేజీ కళ్యాణం’ వంటి విభిన్న చిత్రాల్లో నటించడం తనకు ఆనందాన్నిస్తుందని తెలిపారు. సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ చేయడాన్ని కూడా ఆస్వాదిస్తానని చెప్పారు. కొత్త తరహా కథలు, పాత్రల ద్వారా తనలోని నటనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చని అను అభిప్రాయపడ్డారు.
Also Read
తెరపై కనిపించడం కంటే కెమెరా వెనుక పనిచేయడమంటే తనకు చాలా ఇష్టమని అనుపమ వెల్లడించారు. నటిగా తాను ఎక్కువ విషయాలు నేర్చుకున్నది కెమెరా వెనుక పనిచేసినప్పుడేనని చెప్పారు. 2019లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన అనుభవం ఇప్పటికీ తనకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. ఆ అనుభవం నటనతో పాటు కథలు, పాత్రలను ఎంచుకునే విషయంలోనూ ఎంతో సహాయపడుతోందని వివరించారు. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ చిత్రాల్లో ఒక్కోటి ఒక్కో ప్రత్యేకతతో ఉంటుందని.. కథలు, పాత్రల పరంగా భిన్నంగా ఉండబోతున్నాయని చెప్పారు. కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తే తనను ముందుకు నడిపిస్తోందని అను చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!