తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ చికిటు అని సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
Also Read : EK DIn : ఆ హీరోతో అవసరమా సాయి పల్లవి.. నెటిజన్స్ ట్రోలింగ్
తెలుగులోను ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. కూలీ తెలుగు హక్కులను రూ. 45 కోట్లకు కొనుగోలు చేసారు ఆసియన్ సురేష్. అయితే తెలుగు స్టేట్స్ లో భారీ ఓపెనింగ్ రాబట్టాలంటే ఇప్పుడున్న బజ్ సరిపోదు. అందుకోసం రజినీ రంగంలోకి దిగాలి. ఈ నేపధ్యంలోనే కూలీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం ఆగస్టు 7 డేట్ ను ఫిక్స్ చేసారు తెలుగు పంపిణీదారులు. ఈ ఈవెంట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు లోకేష్ కనగరాజ్, అక్కినేని నాగార్జున హాజరుకానున్నారు. కూలీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ ను ఈ వచ్చే వారం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున, పూజ హెగ్డే కాంబోలో రాబోతున్న ఈ సాంగ్ ను అనిరుద్ ఓ రేంజ్ లో ట్యూన్ చేసాడనే టాక్ ఉంది. భారీ అంచనాలతో వార్ 2 తో పోటీగా వస్తున్న కూలీ ఏ మేరకు వసూళ్లు రాబడతాడో చూడాలి.