YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద యూట్యూబర్ రమా నందన పోలీసుల విచారణలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కన్సల్టెన్సీ ముసుగులో జరిగిన వ్యవహారాలపై పోలీసులు ఆమెను ఏకంగా మూడు గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. అయితే, ఈ విచారణలో పోలీసులకు ఏమాత్రం సహకరించకుండా రమా నందన పొంతనలేని సమాధానాలు చెప్పడం తీవ్ర సంచలనంగా మారింది. కన్సల్టెన్సీకి సంబంధించిన లావాదేవీలు, ఇతర వ్యవహారాలన్నీ తన భర్త మధుకర్ మాత్రమే చూసుకుంటారని, వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె పూర్తిగా నెపాన్ని భర్తపైకి నెట్టేసే ప్రయత్నం చేశారు. “నేను కేవలం యూట్యూబ్ వీడియోలు మాత్రమే చేస్తాను, మిగతా విషయాలు నాకు తెలియవు” అని విచారణలో బుకాయించారు.
అయితే, రమా నందన యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసిన వీడియోల్లోని కంటెంట్, అందులో ఆమె చేసిన ప్రమోషన్ల గురించి పోలీసులు గట్టిగా నిలదీయడంతో ఆమె వద్ద సరైన సమాధానం కరువైంది. తాను స్వయంగా చెప్పిన మాటల గురించే పోలీసులు ప్రశ్నలు సంధించడంతో ఆమె నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఎంత ప్రశ్నించినా ఆమె నుంచి స్పష్టమైన వివరాలు రాకపోవడం, దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సమాధానాలు దాటవేస్తుండటంతో పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో, ఈ నెల 16వ తేదీన తప్పనిసరిగా మరోసారి విచారణకు హాజరుకావాలని రమా నందనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణలో ఆమె భర్త మధుకర్ పాత్ర, ఆ వీడియోల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలు మరింత బహిర్గతమయ్యే అవకాశం ఉంది.
Also Read
- Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
- Irumudi : పవిత్ర దీక్షను తాగుబోతులకు ఆపాదిస్తారా? 'ఇరుముడి'పై భగ్గుమన్న అయ్యప్ప భక్తులు..
- Viswanadh & Sons : ఈ వారమే OTTలోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఎక్కడ చూడాలంటే?
- AVD తర్వాత మరో మల్టీప్లెక్స్.. నార్త్ హైదరాబాద్‌పై రౌడీ హీరో కన్ను!
తాజావార్తలు
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
-
Malavika Mohanan: డూప్ వద్దు.. నేనే దూకేస్తా.. ‘సర్దార్ 2’ సెట్స్‌లో మాళవిక సాహసం!
-
Fauzi: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫుల్ స్పీడ్‌లో ‘ఫౌజీ’ పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!