పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. గతంలో పవన్ తో ఖుషి, బంగారం వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. మరో నాలుగు రోజుల్లో ‘హరి హర వీరమల్లు’ థియేటర్స్ లో విడుదల కానుంది. అందుకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు.
Also Read : Power Star : పుష్ప 2.. డే -1 కలెక్షన్స్ ను హరిహర బీట్ చేస్తాడా.?
అయితే ఇప్పడు హరిహర వీరమల్లుకు అనుకోని కష్టం వచ్చి పడింది. చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం బంగారం, ఆక్సిజన్, ముద్దుల కొడుకు సినిమల నష్టాలను భర్తీ చేయాలనీ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు దాఖలు చేస్తూ లేఖ విడుదల చేసారు. ఆ లేఖలో “ఆక్సిజెన్” సినిమా కోసం చెల్లించిన రూ. 2. 60 కోట్లు బకాయి ఉన్న మొత్తాన్ని రికవరీ చేయాలని ఎ.ఎం. రత్నం, శ్రీ సూర్య మూవీస్ పై ఫిర్యాదు చేసినట్లు డిస్ట్రిబ్యూటర్ సభ్యులకు తెలియజేయడమైనది. అలాగే ముద్దుల కొడుకు మరియు బంగారం చిత్రాలకు చెల్లించిన రూ. 90 లక్షలు బ్యాలెన్స్ రీఫండబుల్ డిస్ట్రిబ్యూషన్ అడ్వాన్స్ ను రికవరీ చేయాలని ఎ.ఎం.రత్నంపై మహాలక్ష్మి ఫిల్మ్స్ మరో ఫిర్యాదు దాఖలు చేసాము. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయాన్ని పరిష్కరించడంలో ఛాంబర్‌తో సహకరించాలని మరియు నైజాంలో “హరి హర వీర మల్లు” సినిమా విడుదలకు ముందు ఆసియన్ ఎంటర్‌ప్రైజెస్ మరియు మహాలక్ష్మి ఫిల్మ్స్ సంబంధిత బకాయిలకు మించి వసూలు చేయడంలో తమకు సహాయం చేయాలని మేము అభ్యర్థిస్తున్నాము’ అని పేర్కొన్నారు. మరోవైపు నాలుగు రోజుల్లో రిలీజ్ కు రెడీ అవుతోంది హరిహర వీరమల్లు. మరి ఈ అవరోధాన్నీ ఏ ఎం రత్నం ఎలా పరిష్కరిస్తారో చూడాలి.