‘కలర్స్’ స్వాతి కమ్ బ్యాక్ మూవీ స్టిల్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కలర్స్’ స్వాతి వివాహానంతరం సినిమాలు చేస్తుందా? చేయదా? అనే విషయంలో చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేశారు. అయితే 2018లో పైలట్ వికాశ్ వాసు ను వివాహం చేసుకున్న స్వాతి మాత్రం కమ్ బ్యాక్ గురించి ఎప్పుడూ నోరు తెరిచి చెప్పిందే లేదు. నటన అంటే మక్కువ ఉన్న స్వాతి తప్పకుండా రీ-ఎంట్రీ ఇస్తుందని కొందరన్నారు. మరికొందరు సినిమాల్లో నటించకపోయినా… వెబ్ సీరిస్ చేసే ఛాన్స్ ఉందన్నారు. కానీ పెళ్ళి తర్వాత కూడా నటిగానే కొనసాగడానికి స్వాతి సిద్దమైపోయింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘పంచతంత్రం’ మూవీలో స్వాతి కీలక పాత్ర పోషిస్తోంది.
Read Also: శివానీ రాజశేఖర్ కు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ టీమ్ బర్త్ డే విషెస్
Also Read
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
- Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
- Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్‌కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
ఈ సినిమాలో బ్రహ్మానందం, సముతిర ఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేశ్ అగస్త్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటీనటుల జాబితాలో స్వాతి రెడ్డి అనే పేరున్నా… నటి స్వాతి పేరు చివర పదంతో పాపులర్ కాదు కాబట్టి… చాలామంది ఇంకెవరో అనుకున్నారు. అయితే తాజాగా ‘పంచతంత్రం’ సెట్ లో పాల్గొన్న స్వాతి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో… స్వాతి కమ్ బ్యాక్ మూవీ విషయంలో అందరికీ, ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ కు ఓ క్లారిటీ వచ్చింది. నూతన దర్శకుడు హర్ష పులిపాక తో సృజన్ ఎరబోలు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 2017లో స్వాతి చివరగా ‘లండన్ బాబులు’ మూవీలో నటించింది. ఆ తర్వాత ఆమె నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. మరి నటిగా తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి స్వాతి ఎలాంటి కసరత్తు చేసిందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే!
తాజావార్తలు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
Alia Bhatt: “నా మనసు ముక్కలైంది”.. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
-
Healthy Diet : షుగర్ ఉందా.? ఈ 6 ఫుడ్ మిస్టేక్స్ మీ కిడ్నీలను దెబ్బతీస్తున్నాయ్.!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!