NTV Telugu Site icon

Cinema Special : బడా మూవీస్ వల్ల నిర్మాతలు చితికిపోతున్నారా..?

Karan

Karan

రీసెంట్ టైమ్స్‌లో నిర్మతలు  కొన్ని విషయాల గురించి ఓపెన్ కామెంట్స్ చేయడం హాట్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతోంది. ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్ చేయరంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడితే.. ఈ సారి సింపథీ కార్డు ప్లే చేయాలంటూ మరో నిర్మాత నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు మరో స్టార్ నిర్మాత భారీ చిత్రాల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నాడు.ఇంతకు ఎవరా నిర్మాత..?  అది తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చదవాల్సిందే..

‘క’ సక్సెస్ మీట్ సందర్భంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ  ఇక్కడ ఎవరూ ఎవరికీ సపోర్ట్ చేయరు.  మీరు కష్టపడి మీరు సక్సెస్ కావాలి, అప్పుడే మేమొచ్చి అప్లాజ్ చేస్తామంటూ డార్క్ సైడ్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి ఓపెన్‌గా చెప్పేశారు. తాజాగా నాగ వంశీ సైతం నెక్ట్స్ తన సినిమా వచ్చేటప్పుడు సింపథీ కార్డ్ ప్లే చేయాల్సిందే అంటూ.. రీసెంట్ టైమ్స్‌లో తన సినిమా రిజల్ట్ విషయంలో ఫేస్ చేసిన ఎదురు దెబ్బలను ఉద్దేశించి కామెంట్ చేశారు.

Also Read : Arun Vijay : సంక్రాంతి రేస్ లో బాలా.. గట్టిగా కొట్టేలా ఉన్నాడే..?

రీసెంట్లీ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కూడా ఇలాంటి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్ సంస్థ 50 శాతం షేర్‌ను సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అదార్ పూనావాలాకు విక్రయించిన న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. లాస్ వల్లే తన వాటా అమ్మేస్తున్నాడన్న విమర్శలపై ఎట్టకేలకు స్పందించాడు. తనకి ఇప్పుడు అవసరం అందుకే చేశానని యాక్సెప్ట్ చేశాడు. ‘బడా ప్రాజెక్ట్స్ చేయాలంటే  బిగ్ స్టూడియోలతో చేతులు కలపాలి. చాలా మంది భారీ బడ్జెట్ సినిమా చేస్తే లాభాలు వస్తాయని అని అనుకుంటారు. కానీ అది అబద్దం. చిన్న బడ్జెట్ సినిమాలు చేసి సక్సెస్ అయితే ప్రాఫిట్ వస్తుంది’ అని చెబుతున్నాడు. బ్రహ్మస్త్ర విషయంలో నాకు ఇదే జరిగింది.

Also Read : Dulquer Salmaan : లక్కీ భాస్కర్ రన్నింగ్ సూపర్..మొత్తం ఎన్ని కొట్లో తెలుసా..?

బ్రహ్మాస్త్ర’ రూ.420 కోట్లు రాబట్టింది.. కానీ సినిమా బడ్జెట్టే 400 కోట్లు. లాభం కేవలం 20 కోట్లు మాత్రమే. ఒకేసారి లంసమ్ ఎమౌంట్ ఎంతటి బడా నిర్మాతకైనా భారమే. దీంతో అంతటి బడ్జెట్ పెట్టలేక.. మరొకరితో టయ్యప్ కావాల్సిన పరిస్థితి. ఇదే ధర్మ ప్రొడక్షన్ సేల్‌కు కారణమైంది. వెయ్యి కోట్లు పెట్టి అదార్ పూణెవాలా 50 శాతం షేర్ కొన్నాడు. ఇదే పరిస్థితులు టాలీవుడ్‌లోనూ కనిపిస్తున్నాయి. దిల్ రాజు, నాగవంశీ, కరణ్ జోహార్ లాంటి స్టార్ నిర్మాతలే ఇలాంటి సిచ్యుయేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయని చెబుతుంటే.. ఇక చోటా నిర్మాతల సంగతేంటంటారు..?

Show comments