డిసెంబరులో రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ఇప్పటికి గందరగోళంగానే ఉంది. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన అల్లు అర్జున్, సుక్కుల పుష్ప -2 డిసెంబరు 6న వస్తోంది. దింతో అప్పటికే డిసెంబరు ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమాలు అయోమయంలో పడ్డాయి. పోటీగా రిలీజ్ చేద్దాం అంటే అవతల భారీ హైప్ తో వస్తున్నా సినిమా థియేటర్లు అన్ని ఆ సినిమానే వేస్తారు, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం.
Also Read : Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?
డిసెంబరులో రిలీజ్ కు అనుకూలమైన మరొక డేట్ క్రిస్మస్. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండడంతో ఆ డేట్ కు రావాలని కొన్ని సినిమాలు ముందుగా కర్చీఫ్ వేసాయి. కానీ శంకర్, రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ డిసెంబరు 20న రిలీజ్ కు చక చక ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మిగిలిన సినిమాల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారయ్యింది. కానీ రెండు మిడ్ రేంజ్ సినిమాలు మాత్రం అనుకోకుండా అవకాశం కుదిరితే క్రిస్మస్ టైమ్ లో రిలీజ్ చేసేందుకు వీలుగా మాడ్ 2, రాబిన్ హుడ్ సినిమాలు చకచకా రెడీ చేస్తున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ ను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు కు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు వస్తుందా రాదా అన్న అనుమానం అందరిలో ఉంది. ఇప్పటికి ఈ సినిమా షూట్ కొంత బ్యాలెన్స్ ఉంది. దర్శకుడు శంకర్ USA లాస్ వేగాస్‌లో గేమ్ ఛేంజర్ యొక్క CG వర్క్స్‌పై పని చేస్తున్నారు.