మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం “ఆచార్య” చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తరువాత “లూసిఫర్” రీమేక్ పై దృష్టి సారించనున్నారు. రీమేక్ స్పెషలిస్ట్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. “లూసిఫర్” రీమేక్ కోసం ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్లను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం కాస్టింగ్ జరుగుతోంది. ఇంకా హీరోయిన్ ఖరారు కాలేదు. అయితే ఇందులో చిరంజీవి సరసన లేడీ సూపర్ నయనతార అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. చిరంజీవి కూడా నయనతార హీరోయిన్ గా నటించాలని అనుకుంటున్నారట.
Read Also : ఆ కేసుతో నాకు సంబంధం లేదు… శిల్పాశెట్టి
ఇంతకుముందు చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో “సైరా” చిత్రం రూపొందింది. ఈసారి కూడా ఖచ్చితంగా నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా కావాలని చిరంజీవి నిర్మాతలకు సూచించారట. ఈ చిత్రం కోసం నయన్ కు భారీ రెమ్యూనరేషన్ ను చెల్లించడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే “లూసిఫర్” రీమేక్ మేకర్స్ నుండి వచ్చిన ప్రతిపాదనపై నయన్ ఇంకా స్పందించలేదు. దీంతో దర్శకుడు మోహన్ రాజా ఇతర హీరోయిన్ల పేర్లు పరిగణనలోకి తీసుకుంటున్నారట. కాని మెగాస్టార్ మాత్రం నయన్ మాత్రమే ఈ కీలక పాత్రకు న్యాయం చేయగలదని భావిస్తున్నారట. మరి నయన్ ఏమంటుందో చూడాలి. కాగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కొంతమంది బాలీవుడ్ తారలు కూడా ఈ చిత్రంలో భాగం కానున్నారు.