Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్సాఫీస్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఓటీటీని షేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ కోసం చిరు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సరికొత్త టాక్ షో ‘మెగావర్స్’ (#MEGAVerse) షూటింగ్ ఈరోజే ప్రారంభమైంది. బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్’ సాధించిన సెన్సేషనల్ సక్సెస్ తర్వాత, ఇప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ స్వయంగా ఒక టాక్ షోను హోస్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ షోకి సంబంధించి నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన బిగ్గెస్ట్ సెన్సేషనల్ పాయింట్ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్ లైనప్. ఏకంగా మూడు తరాలకు చెందిన కామెడీ కింగ్స్‌ను ఒకే వేదికపైకి తీసుకొచ్చి నెట్‌ఫ్లిక్స్ మాస్టర్ స్ట్రోక్ వేసింది. టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, తనదైన టైమింగ్‌తో నవ్వించే సునీల్, ప్రస్తుత ట్రెండింగ్ కమెడియన్ సత్య.. ఈ ముగ్గురూ కలిసి చిరు టాక్ షో తొలి ఎపిసోడ్‌కు గెస్టులుగా హాజరయ్యారు. ఈ రోజే ఈ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ హైదరాబాద్‌లో అత్యంత భారీ సెట్లో జరుగుతోంది.
చిరంజీవిలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్రహ్మానందం, సునీల్‌లతో ఆయనకున్న సాన్నిహిత్యం, స్క్రీన్ మీద వాళ్లు పండించిన వింటేజ్ హ్యూమర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలతో పాటు, యంగ్ సెన్సేషన్ సత్య పంచ్ డైలాగ్స్ కూడా తోడవ్వడంతో ఈ ఎపిసోడ్ ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ను తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక రెగ్యులర్ ఇంటర్వ్యూలా కాకుండా, ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించేలా ఈ ఫస్ట్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. వెండితెరపై తన గ్రేస్, ఎనర్జీతో మ్యాజిక్ చేసే చిరంజీవి.. ఇప్పుడు హోస్ట్‌గా మారి తన అతిథులతో ఎలాంటి ముచ్చట్లు పంచుకుంటారు, వాళ్ల నుంచి ఎలాంటి సీక్రెట్స్ రాబడతారు అనేది తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. తొలి ఎపిసోడ్‌కే ఈ రేంజ్ గెస్ట్ లైనప్ ఉంటే, రాబోయే ఎపిసోడ్స్‌లో ఇంకెంత మంది బడా స్టార్లు ఈ ‘మెగావర్స్’లో సందడి చేస్తారో అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Kiran Abbavaram Reality : ఓ పాట జెన్యూన్'గా హిట్ అయితే రిజల్ట్ ఇలా ఉంటది!
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
తాజావార్తలు
-
Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
-
Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
-
Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!