టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రాల్లో చిరు-అనిల్ రావిపూడి మూవీ ఒకటి. మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. అందులోను డబ్బింగ్ చిత్రాలే ఎంచుకోవడంతో మెగా ఫ్యాన్సికి కిక్ ఇవ్వలేక పోయ్యాయి. కానీ అనిల్ రావిపూడి మామూలోడు కాదని అందరికీ తెలిసిందే. అది కూడా నిజమే కదా.. కనీసం మూవీ ప్రమోషన్స్ , సక్సెస్ మీట్స్ కూడా అటెండ్ అవ్వని నయన తార చేత.. ఏకంగా మూవీ ప్రోమో చేయించి అనౌన్స్ చేసేలా చేశాడు. చిరు నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న కామిడి యాంగిల్‌ను, ఈ మూవీలో కంప్లీట్‌గా చూపించాలని డిసైడ్ అయిపోయాడు అనిల్. దీంతో అభిమానులకు కూడా ఈ మూవీ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది..
కాగా ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా మొదలైన సంగతి తెలిసిందే. అయితే మొదటి షెడ్యూల్‌ని స్టార్ట్ చేసుకున్న సినిమా సూపర్ స్పీడ్‌లో ఈ షెడ్యూల్‌ని ఆల్రెడీ కంప్లీట్ చేసేసిందట. అదికూడా ఒక రోజు ముందే షెడ్యూల్‌ని అనీల్ అండ్ టీం ప్యాకప్ చెప్పినట్టుగా టాక్. మొత్తానికి అనీల్ రావిపూడి అండ్ టీం మెగాస్టార్ సినిమాకి పర్ఫెక్ట్ వర్క్‌ని అందిస్తున్నారని అర్ధం అవుతుంది. ఇక రెండో షెడ్యూల్‌కి కూడా రంగం సిద్ధం చేసినట్టుగా సమాచారం. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ గట్టిగా కిట్టెటా అనిపిస్తోంది..