Boyapati: చిరంజీవి, బాలయ్యల కోసం కథ రెడీ చేసిన స్టార్ డైరెక్టర్

Balayya Boyapati Chiru

Balayya Boyapati Chiru

గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది దర్శకులు చిరంజీవి, బాలయ్యలను కలపాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లిద్దరినీ కలిపి ఒక సినిమాలో చూస్తే ప్రేక్షకుల ఆనందానికి అవధులు ఉండవు. అలాగే ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్‌లను బ్రేక్ చేస్తుందనే ధోరణిలో చాలా రకాల అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. గతంలో చిరంజీవి, బాలయ్య ఇద్దరూ కలిసి నటించడానికి ఆసక్తిగా ఉన్నాం అంటూ పలు సందర్భాల్లో తెలియజేశారు. బోయపాటి శ్రీను లాంటి దర్శకుడికి సైతం చిరంజీవి ఒక సవాల్ విసిరాడు. మా ఇద్దరి ఇమేజ్‌కి తగిన కథ తీసుకొస్తే నీతో సినిమా చేస్తామంటూ చిరంజీవి ఓపెన్‌గా చెప్పేశాడు.

ప్రస్తుతం బోయపాటి శ్రీను సైతం వీళ్ళిద్దరి ఇమేజ్‌కి తగ్గట్టుగా కథను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే కథ కూడా ఫైనల్ దశకు చేరుకుందని, ఇప్పటికే ఆ కథను బాలయ్యకి వినిపించారని, ఆయనకి బాగా నచ్చిందనే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవికి చెప్పడానికి ఆయన క్యారెక్టర్‌ను ఇంకొంచెం డెవలప్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే వీళ్ళిద్దరినీ కలిపి బోయపాటి సినిమా చేసినట్లయితే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా, బోయపాటి టాప్ రేంజ్‌కి వెళ్ళిపోతాడు.

ఇప్పటికే బాలయ్య బాబుకు వరుసగా మూడు సక్సెస్‌లను అందించాడు. ‘అఖండ 2’ సినిమా కొంతవరకు తేడా కొట్టినా కూడా బోయపాటి మార్క్ మాత్రం ఎక్కడా మిస్ అవ్వలేదు. మెగా హీరోల్లో రామ్ చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ మూవీ చేశాడు. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ బోయపాటి ఎక్కడా కూడా డీలా పడకుండా వరుస కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.

అక్కడక్కడ కొన్ని సినిమాలు మిస్‌ఫైర్ అయినా కూడా, బోయపాటికి ఉన్న ఇమేజ్‌కి స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అభిమానులు సైతం బోయపాటి సినిమా చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం విశేషం. చిరంజీవి, బాలయ్యలను కలిపి బోయపాటి ఎలాంటి సినిమా చేస్తాడు, యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఎలా డిజైన్ చేస్తాడు అనేది తెలుసుకోవడానికి చాలామంది ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తొందరగా ఈ సినిమా కథ ఫైనల్ చేసి సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తాడా, లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.