Chinmayi: డబ్బింగ్ రూమ్‌లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ సింగర్‌గా, టాలెంటెడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా వ్యాక్తిగత విషయాల్లో ఎక్కువగా వార్తలో నిలుస్తూ ఉంటుంది. అయితే 2018లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ (#MeToo) ఉద్యమంలో భాగంగా.. ప్రముఖ తమిళ గేయ రచయిత వైరముత్తు, డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిలపై చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ధైర్యానికి ప్రతిఫలంగా తమిళ డబ్బింగ్ యూనియన్ ఆమెపై అన్యాయంగా నిషేధం (Ban) విధించింది. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 2023లో విజయ్ ‘లియో’ సినిమాతో త్రిషకు డబ్బింగ్ చెప్పి రీ-ఎంట్రీ ఇచ్చిన చిన్మయి.. ఇప్పుడు ‘కరుప్పు’ (వీరభద్రుడు) సినిమాలో త్రిష క్యారెక్టర్‌కు ప్రాణం పోశారు. అయితే ఈ ప్రయాణం ఆమెకు అంత సులువుగా సాగలేదు.
గత కొన్నేళ్లుగా తమిళ సినీ పరిశ్రమలో ఎదుర్కొంటున్న నిషేధాలు, ఆంక్షలపై మరోసారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు చిన్మయి.. ‘ ‘కరుప్పు’ సినిమాలో త్రిష పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. డబ్బింగ్ స్టూడియోలో కూర్చుని కొన్ని ఎమోషనల్ సీన్లకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు.. నా పాత చేదు జ్ఞాపకాలు, గత కొన్నేళ్లుగా నాపై జరిగిన అన్యాయం, నన్ను మానసికంగా వేధించిన సంఘటనలు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. దాంతో మైక్ ముందే నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను.కేవలం తన హక్కుల కోసం, తోటి మహిళల భద్రత కోసం మాట్లాడినందుకు నా సొంత పరిశ్రమలోనే (కోలీవుడ్) ఒక అంటరానిదానిలా చూశారు. ఇప్పటికీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎన్నో లీగల్ అడ్డంకులను, ఆంక్షలను దాటుకుని రావాల్సి వస్తోంద’ అని పేర్కొంటూ.. ‘భవిష్యత్తులో ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండా నా సొంత పరిశ్రమలో నేను స్వేచ్ఛగా పనిచేసే రోజులు త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని చిన్మయి రాసుకొచ్చారు.
Also Read
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
- Varanasi Update: 'వారణాసి'లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. 'భోగి' టీజర్ రిలీజ్
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!