‘బాహుబలి, రేసుగుర్రం, మళ్ళీ రావా, దువ్వాడ జగన్నాధం, నా పేరు సూర్య’ వంటి చిత్రాలతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సాత్విక్ వర్మ. ఇప్పుడీ కుర్రాడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాత్విక్ వర్మ, నేహా పఠాన్ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో రమేశ్ ఘనమజ్జి ఓ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నాడు. రఘు కుంచే సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘బ్యాచ్’ అనే పేరు పెట్టారు. ఇటీవలే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ‘క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో కొందరు పోకిరి కుర్రాళ్ల కథే మా సినిమా అని దర్శకుడు శివ చెబుతున్నాడు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సాత్విక్ వర్మను హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాను ప్రారంభించామని, ఈ యేడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్నం, కాకినాడలో 59 రోజులలో చిత్రీకరణ పూర్తి చేశామని నిర్మాత రమేశ్ చెప్పారు. అతి త్వరలోనే ఈ సినిమా విడుదల వివరాలను తెలియచేస్తామని అన్నారు.