రాబోయే డిసి చిత్రం ‘ది సూసైడ్ స్క్వాడ్’ కొత్త ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు యాక్షన్ ప్రియుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా “దె ఆర్ డయింగ్ టు సేవ్ ది వరల్డ్” అంటూ ఈ చిత్రం ట్రైలర్ ను తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల చేశారు.
Read Also : అర్జున్ దాస్ తో అందాల రాక్షసి… “ఉన్నానని” వీడియో సాంగ్
డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ భారీ యాక్షన్ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. మార్గోట్, రాబీ, ఇడ్రిస్ ఎల్బా, జాన్ సెనా, వియోలా డేవిస్, జై కోర్ట్నీ, పీటర్ ప్రపంచాన్ని కాపాడటానికి సిద్ధమవుతున్నారు. ఈ యుద్ధంలో తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడబోతున్నారు. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తున్న “రెయిన్” సాంగ్ ట్రైలర్ పై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్… ఇలా ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 6న థియేటర్లలోనే కాకుండా హెచ్‌బిఓ మాక్స్‌లో కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంది.