NTV Telugu Site icon

80’s Stars Reunion: చూడముచ్చటైన దృశ్యం.. అలనాటి భారత స్టార్లు

Tollywood

Tollywood

80s Stars Reunion: సినీ పరిశ్రమలో స్టార్స్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా అగ్ర హీరోల మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. సినీ పరిశ్రమలోని హీరో, హీరోయిన్ల మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఒకే ఫ్రేమ్ లో మనకు నచ్చిన స్టార్స్‌ అందరూ ప్రత్యక్షమైతే చూడముచ్చటగా ఉంటుంది. ఒకే ఆఫ్రేమ్‌ లో హీరో హీరోయిన్లు కనిపించి ఫ్యాన్స్‏ను ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తమ ఫేవరేట్ స్టార్స్ ఇలా చాలా కాలం తర్వాత కలవడంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకూ వీరంతా ఎందుకు కలిసారు?

ఎయిటీస్ స్టార్స్ రీయూనియ‌న్ పేరుతో గ‌త కొన్నేళ్లుగా అల‌నాటి స్టార్స్ ప్రతి ఏడాది ఓ స్పెష‌ల్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జాకీ ష్రాఫ్, పూనమ్ ధిల్లాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ వేడుక‌లో ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌కు చెందిన 80వ ద‌శ‌కానికి చెందిన‌ హీరోలుహీరోయిన్లు అంద‌రూ పాల్గొంటున్నారు. 1980వ ద‌శ‌కంలో అగ్రనాయ‌కానాయిక‌లుగా వెలుగొందిన తార‌లంద‌రూ ఒక చోట‌కు చేరుకున్నారు. ఆట పాట‌ల‌తో సంద‌డి చేశారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి. ఈ వేడుక‌లో చిరంజీవి, వెంక‌టేష్‌, అనుప‌మ్ ఖేర్‌, శ‌ర‌త్‌కుమార్‌, భానుచంద‌ర్‌, అర్జున్‌, అనిల్‌క‌పూర్, రేవ‌తి,

సుమ‌త‌ల‌, న‌దియా, సుహాసిని, జ‌య‌ప్రద‌, రాధ‌, శోభ‌న‌, న‌రేష్ , రాజ్‌ బబ్బర్‌, విద్యాబాలన్‌,

టీనా అంబానీ,మీనాక్షి శేషాద్రి, ఖుష్బూ, త‌దిత‌రులు పాల్గొన్నారు.