Remo DSouza: షాకింగ్: మరో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌పై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Case Filed Remo D Souza for cheating a dance troupe of 11.96 crore: ఒక పక్క జానీ మాస్టర్ మీద రేప్ కేసు నమోదై పెద్ద చర్చకు దారి తీయగా ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా మీద కేసు నమోదు అయింది. రెమో డిసౌజా సహా అతని భార్య లిజెల్ డిసౌజా అలాగే మరో ఐదుగురిపై మోసం చేసినందుకు కేసు నమోదైంది. ఈ మేరకు శనివారం ఒక ఫిర్యాదు చేసినట్లు ముంబైలోని థానే పోలీసులు తెలిపారు. రెమో, అతని భార్య, ఇతర వ్యక్తులు కలిసి రూ.11.96 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెమో డిసౌజా, అతని భార్య లీజెల్ మరియు మరో ఐదుగురిపై 26 ఏళ్ల డ్యాన్సర్ ఒకరు ఈ ఆరోపణ చేసినట్లు ఒక అధికారి తెలిపారు. బాధిత డ్యాన్సర్ అక్టోబర్ 16న ముంబైలోని మీరా రోడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రెమో డిసౌజాతో పాటు మరో 6 మంది పై సెక్షన్లు 465 (ఫోర్జరీ), 420 (మోసం) సహా ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Naga Chaitanya: లిఫ్టులో చైతూ-శోభిత.. అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారో!
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ఫిర్యాదు ప్రకారం, ఫిర్యాదు చేసిన డాన్సర్ కి 2018 మరియు జూలై 2024 మధ్య మోసం జరిగింది. తన టీం టీవీ షోలో విజయం సాధించింది. రెమో సహా ఇతర నిందితులు తమ గ్రూప్ తమదేనన్నట్లుగా బిల్డప్ ఇచ్చి వారు గెలుచుకున్న రూ.11.96 కోట్ల ప్రైజ్ మనీని లాక్కున్నారని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ కేసులో రెమో డిసౌజా, లీజెల్ డిసౌజాతో పాటు ఓంప్రకాష్ శంకర్ చౌహాన్, రోహిత్ జాదవ్, ఫ్రేమ్ ప్రొడక్షన్ కంపెనీ, వినోద్ రౌత్, పోలీసు, రమేష్ గుప్తా అనే వ్యక్తిని నిందితులుగా పేర్కొన్నారు.
రెమో డిసౌజా కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడే కాకుండా అనేక రియాల్టీ షోలలో న్యాయనిర్ణేతగా కూడా ఉన్నారు. రెమో డిసౌజా 2009 సంవత్సరంలో రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ప్రారంభించాడు. ఇందులో ‘డ్యాన్స్ ఇండియా డ్యాన్స్’, ‘ఝలక్ దిఖ్లా జా’, ‘డ్యాన్స్ ప్లస్’, ‘ఇండియాస్ బెస్ట్ డాన్సర్’, ‘డిఐడి లిటిల్ మాస్టర్’ అలాగే ‘డిఐడి సూపర్ మామ్స్’ ఉన్నాయి. దర్శకుడిగా టైగర్ ష్రాఫ్ ‘ఫ్లయింగ్ జాట్’, ABCD ఫ్రాంచైజీతో పాటు సల్మాన్ ఖాన్ హీరోగా ‘రేస్ 3’ రెమో డిసౌజా చేసాడు. త్వరలో ఆయన డైరెక్ట్ చేసిన ‘హ్యాపీ’ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్ సింగిల్ ఫాదర్ గా కనిపించనున్నాడు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!