Cameraman Gangatho Rambabu Movie Re Release: దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రం ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. త్వరలో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్. దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2012వ సంవత్సరం అక్టోబర్ లో 1600 పైగా స్క్రీన్స్ లో విడుదలై సంచలనం సృష్టించిన విషయం గుర్తుండే ఉంటుంది. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా కనిపించి అలరించారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదురించే దైర్యశాలిగా ఒక కెమెరామెన్ అయిన గంగను ఆకట్టుకుంటాడు.
Pawan Kalyan: అన్నకు పద్మ పురస్కారం.. తమ్ముడు రాకకై ఎదురుచూపులు.. ?
రాంబాబు మెకానిక్ గా కంటే జర్నలిస్టుగా అయితే బాగుంటుందని భావించి టీవీ ఛానల్ కెమెరామెన్ అయిన గంగ అతనిని జర్నలిస్టుగా తన ఛానల్ లోనే చేర్పిస్తుంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు? అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. మణిశర్మ సంగీతం, శ్యాం కె.నాయుడు ఛాయాగ్రహణం ఈ సినిమాకి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఇప్పడు ఈ సినిమాను ఫిబ్రవరిలో అనుకూలమైన మంచి తేదీని చూసుకుని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత నట్టి కుమార్ తెలిపారు. అయితే డేట్ రివీల్ చేయకపోవడంతో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ లేదు.