Bunny Vasu: కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము..జాగ్రత్త !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండేల్ సినిమా పైరసీ గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో బన్నీవాసు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ మునుపటిలా పైరసీ లేదని అన్నారు. గత రెండేళ్ల నుంచి పైరసీ నియంత్రణలోకి వచ్చిందని పేర్కొన్న ఆయన ‘గీత గోవిందం’ సమయంలో తీసుకున్న కఠిన చర్యలు కారణంగా తరువాతి కాలంలో చాలా వరకూ పైరసీ తగ్గిందని అన్నారు. అన్ని భాషలతో పోలిస్తే, తెలుగులో పైరసీని చాలా వరకూ నియంత్రించామని అన్నారు. తండేల్ అనే ఈ సినిమా మా అందరి కష్టం, రెండేళ్లు ఎంతో శ్రమించాం అని అన్నారు. సినిమా విజయం సాధించి, ఆస్వాదించే సమయంలో ఇలా పైరసీ జరిగిందని తెలిసి షాక్ కి గురయ్యామని అన్నారు. సోమవారం నుంచి టికెట్ రేట్లు తగ్గించాలని అల్లు అరవింద్ సూచించారని, అందుకు తగినట్లు చాలా థియేటర్స్‌లో టికెట్ ధరలు తగ్గించామని అన్నారు. పైరసీ విషయంలో కొంతమంది తెలిసి, మరికొంత మందికి తెలియక ఇలాంటి పనులు చేస్తున్నారు.
Allu Aravind : తండేల్ పైరసీ.. అరెస్ట్ చేయిస్తాం.. గ్రూప్ అడ్మిన్స్ కి అల్లు అరవింద్ హెచ్చరిక
Also Read
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
- Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
క్రిమినల్ కేసు ఫైల్ అయితే, వెనక్కి తీసుకోలేము, గీత గోవిందం టైంలో పెట్టిన కేసులకు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అని అన్నారు. యువత ఇందులో చిక్కుకోవద్దన్న ఆయన ఈరోజు ఉన్న టెక్నాలజీతో ప్రతిదీ ట్రాక్ చేయొచ్చన్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఆర్టీసీ బస్సులో సినిమాను ప్రదర్శించడం మమ్మల్ని మరింత బాధించిందన్నారు. ఈ పైరసీలో మొదటి బాధితుడు పవన్‌కల్యాణ్ దృష్టికీ విషయాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాను. అక్కినేని అభిమానులు , ఇతర సినీ అభిమానులు , ‘తండేల్’ పైరసీ చూస్తున్న వారి గురించి వీడియో చేసి 9573225069 నెంబర్ కు మెసేజ్ చేయండి. సాక్ష్యాలు ఉంటే, కచ్చితంగా న్యాయపోరాటం చేస్తాం’’ అని ఆయన అన్నారు.
- Tags
తాజావార్తలు
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
-
Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
-
Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!